Economy: భారత్ వృద్ధి అంచనాలకు మూడీస్ కోత

by S Gopi |

ప్రస్తుత ఏడాదికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 6 శాతానికి తగ్గించింది. అంతకుముందు అంచనాతో పోలిస్తే ఇది 0.8 శాతం పాయింట్ల కోత.

Economy: భారత్ వృద్ధి అంచనాలకు మూడీస్ కోత
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ భారత వృద్ధి అంచనాల్లో కోత విధించింది. పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన సరఫరాపై అనిశ్చితి భారత ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని మూడీస్ రేటింగ్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 6 శాతానికి తగ్గించింది. అంతకుముందు అంచనాతో పోలిస్తే ఇది 0.8 శాతం పాయింట్ల కోత. 2027లో వృద్ధి అంచనాను కూడా 6 శాతానికే పరిమితం చేసింది. ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు, పారిశ్రామిక కార్యకలాపాలు మందగించడం వల్ల వృద్ధి వేగం తగ్గుతుంది. భారత్‌కు ప్రధాన బలహీనత చమురు దిగుమతులపై అధిక ఆధారపడటమేనని మూడీస్ పేర్కొంది. అధిక చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని పెంచడమే కాకుండా, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కూడా ఒత్తిడి పెంచుతాయని హెచ్చరించింది. అయితే, వ్యవసాయ ఎగుమతులకు కొంత లాభం ఉండొచ్చని మూడీస్ అభిప్రాయపడింది. భారత్‌ దిగుమతులపై ఆధార పడటాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి దీర్ఘకాలిక పరిష్కారం వైపు ఆలోచించాలని విశ్లేషకులు సూచించారు. లేకుంటే, అధిక చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు భారత వృద్ధిపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చని వెల్లడించారు.

Next Story