- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-Pak: భారత్‌తో గొడవలు పెరిగితే పాక్ వృద్ధికి నష్టం తప్పదు: మూడీస్
భారత్ ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుండటం సానుకూల అంశమని అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పెహల్‌గామ్ దాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రెండు దేశాల ఆర్థికవ్యవస్థలపై నోట్‌ను విడుదల చేసింది. సోమవారం విడుదలైన నోట్ ప్రకారం, ఈ పరిణామాల వల్ల భారత ఆర్థికవ్యవస్థ పెద్దగా అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం లేదని పేర్కొంది. భారత్ ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుండటం సానుకూల అంశమని అభిప్రాయపడింది. మరోవైపు, పాక్ దీర్ఘకాలం ఈ ఘర్షణ కొనసాగితే అధిక రక్షణ వ్యయం, ఇప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులు పెరగడం వంటి పరిస్థితులకు దారితీయవచ్చు. ఎక్కువకాలం ఉద్రిక్తతలు కొనసాగితే పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. భారత్‌తో పోలిస్తే చాలా ఎక్కువ నష్టపోవాల్సి ఉంటుంది. వృద్ధి క్షీణించడం, అప్పుల కోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం వంటి సవాళ్లు తప్పవని మూడీస్ వివరించింది. అంతేకాకుందా తన వద్ద విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గిపోవడం వల్ల పాక్ మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే పాక్ వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలతో విదేశీ అప్పులు కట్టలేని స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ నిబంధనలకు తలొగ్గడమే పాక్ ముందున్న సరైన నిర్ణయమని మూడీస్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో భారత ఆర్థికవ్యవస్థ వృద్ధితో పాటు మెరుగైన ప్రభుత్వ వ్యయం, ప్రజల కొనుగోలు శక్తి ద్వారా పాక్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు ఎక్కువ ప్రభావం చూపించవు. పైగా పాకిస్తాన్‌తో భారత్ఓ ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేకపోవడం భారత్‌కు మరింత కలిసొచ్చే అంశమని మూడీస్ పేర్కొంది.






