- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Awas Yojana: దటీజ్ మోదీ.. పేదల కోసమే పుట్టిన ప్రధాని.. సొంతింటి కలను నిజం చేసుకునే పథకం
PM Awas Yojana: భారత ప్రభుత్వం 2015లో అందరికీ ఇళ్లు నిర్మించాలన్న ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ స్కీమును లాంచ్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: PM Awas Yojana: భారత ప్రభుత్వం 2015లో అందరికీ ఇళ్లు నిర్మించాలన్న ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ స్కీమును లాంచ్ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకు 2025 నాటికి హౌసింగ్ ఫర్ ఆల్ నినాదం కింద ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ పథకం అర్హత గల కుటుంబాలకు విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, వంటగది వంటి ప్రాథమిక సౌకర్యాలతో పక్కాఇళ్లను నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. పీఎంఏవై రెండు భాగాలుగా ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో నివసించే ప్రజలు పీఎంఏవై అర్బన్, గ్రామాల్లో నివసించే వారికి పీఎంఏవై గ్రామీణ్ గా సేవలు అందిస్తుంది. ఈ స్కీమ్ కింద అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి క్రెడిట్ లింక్డ్ సబ్సిడి స్కీమ్ ద్వారా హోంలోన్ వడ్డీ రాయితీ లభిస్తుంది. అర్హత కలిగిన దరఖాస్తుదారులు 20ఏళ్ల వరకు గల టెన్యూర్ పై హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 6.5శాతం వరకు సబ్సిడీని పొందవచ్చు.
సబ్సిడీ అమౌంట్ అనేది మీ ఇన్ కమ్ గ్రూప్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణగా చెప్పుకుంటే ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారైతే..ఏడాదికి రూ. 3లక్షల వరకు సంపాదిస్తే..రూ. 3లక్షల నుంచి రూ. 6లక్షల మధ్య సంపాదిస్తున్న తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారైతే ప్రయోజనం పొందవచ్చు. అలాగే రూ. 18లక్షల వరకు సంపాదిస్తున్న మధ్యతరగతి వర్గాలు కూడా ఈ స్కీమ్ నుంచి ప్రయోజనం పొందవచ్చు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు గరిష్టంగా రూ. 2.67 లక్షలు రాయితీ పొందే అవకాశం ఉంది.
పీఎంఏవై కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీరు మొదటిసారి ఇంటి యజమాని అయి ఉండాలి. అంటే మీకు మీ కుటుంబానికి దేశంలో ఎక్కడా కూడా పక్కా ఇల్లు ఉండకూడదు. దరఖాస్తుదారు అర్హత కలిగిన ఆదాయ వర్గాలకు చెందినవారు అయి ఉండాలి. కుటుంబంలో భార్య, భర్త,అవివాహిత పిల్లలు ఉండాలి. అలాగే మీరు ఇంతకుముందు ఏ ఇతర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ నుంచి సహాయం తీసుకోకూడదు. పీఎంఏవై అర్బన్ అయితే మీరు పట్టణ ప్రాంతంలో నివసించాలని లేదంటే గుర్తింపు పొందిన పట్టణ పేద జనాభాలో భాగమై ఉండాలి. పీఎంఏవై గ్రామీణ్ అయితే మీరు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఉండాలి. నిరాశ్రయులై ఉండాలి లేదంటే దెబ్బతిన్న లేదా అసురక్షిత ఇంట్లో నివసిస్తుండాలి.
దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్ సైట్ pmaymis.gov.in ని సందర్శించాలి. సిటిజన్ అసెస్ మెంట్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, పర్సనల్ డీటైల్స్ ఎంటర్ చేయండి. సబ్‌మిట్ చేశాక..భవిష్యత్తు అవసరాల కోసం మీ దరఖాస్తు రిఫరెన్స్ నెంబర్ ను సేవ్ చేయాలి.






