Pension: పెన్షనర్లకు మోదీ సర్కార్ భారీ శుభవార్త..రూ. 7,500కి పెరుగుతున్న పెన్షన్

by Vennela |

Pension: చాలా ఏళ్లుగా భారత్ లో కార్మిక సంఘాలు, పెన్షనర్ గ్రూపులు ఈపీఎస్ 95గా పేర్కొనే ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.

Pension: పెన్షనర్లకు మోదీ సర్కార్ భారీ శుభవార్త..రూ. 7,500కి పెరుగుతున్న పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: Pension: చాలా ఏళ్లుగా భారత్ లో కార్మిక సంఘాలు, పెన్షనర్ గ్రూపులు ఈపీఎస్ 95గా పేర్కొనే ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2014లో రూ. 1,000గా నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్ ను అప్ డేట్ చేయలేదు. ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ ఈ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపును ఇచ్చింది. దీంతో పెన్షన్ అమౌంట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 1995లో ప్రారంభించిన ఈపీఎస్ 95 అనేది రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే స్కీమ్. ఇది కనీసం పదేళ్లుగా పెన్షన్ ప్లాన్ కు కాంట్రిబ్యూట్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలను అందిస్తుంది. అయితే 10ఏళ్ల క్రితం నిర్ణయించి రూ. 1,000 మినిమం పెన్షన్, ఇప్పుడు ఏమాత్రం సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బస్వరాజ్ బొమ్మై నేత్రుత్వంలోని పార్లమెంటరీ కమిటీ, కేంద్ర కార్మిక శాఖను కోరింది. ఈపీఎస్ థర్డ్ పార్టీ ఎవాల్యూవేషన్ ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్స్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. ఈ రివ్యూ స్కీమ్ అంచనా వేసి..ఇంప్రూవ్ మెంట్స్ ను సూచించే లక్ష్యంతో జరుగుతుంది. 30ఏళ్లలో ఇలాంటి రివ్యూ జరగడం కూడా ఇదే మొదటిసారి. 2025 చివరికి పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

కమిటీ రిపోర్ట్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. 2014 నుంచి జీవన వ్యయం ఎన్నో రేట్లు పెరిగింది. కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉందని తెలిపింది. ఈ అంశాన్ని అత్యవసర భావనతో పరిగణించి కనీస పెన్షన్ పెంచాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది. 2020లో కనీస పెన్షన్ రూ. 2000కి పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి తెలిపింది. కానీ ఆర్థిక శాఖ దాన్ని తిరస్కరించింది. 2024-25 బడ్జెట్ కు ముందు ఈ ఆలోచన మళ్లీ చర్చకు వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో రిటైర్డ్ ఈపీఎస్ 95 ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిపి, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొవడానికి పెన్షన్ తోపాటు , డియర్ నెస్ అలవెన్స్ పెంచాలని కోరారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు రిటైర్మెంట్ చేసిన వారికి సహాయం చేయడానికి ట్రేడ్ యూనియన్లు , ఉద్యోగి సంఘాలు చాలా కాలంగా రూ. 7,500 పెన్షన్ ను డిమాండ్ చేస్తున్నాయి.

థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపు లక్షాలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లలో ఆశ కలిగిస్తుంది. జీవన వ్యయాలు పెరుగుతున్నందున పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం అందిస్తుంది. 2025 చివరి నాటికి గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది.

Next Story