- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MobiKwik: లోన్లు ఇవ్వనున్న మొబిక్విక్
ఈ లోన్ బిజినెస్ కోసం మాతృసంస్థ మొబిక్విక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పూర్తిగా కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ మొబిక్విక్ త్వరలో సొంత రుణ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమం అయింది. సోమవారం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నుంచి కంపెనీ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్ కోసం ఆమోదం పొందినట్లు తెలిపింది. ఈ లోన్ బిజినెస్ కోసం మాతృసంస్థ మొబిక్విక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పూర్తిగా కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు వంటి కొత్త క్రెడిట్ సౌకర్యాలను వినియోగదారులకు అందిస్తుంది. ఆర్‌బీఐ ఆమోదంతో మొబిక్విక్ ఒక సాధారణ డిజిటల్ పేమెంట్ యాప్ నుంచి పూర్తి స్థాయి ఆర్థిక సేవల సంస్థగా మారనుంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో లోన్ సదుపాయాలను విస్తరించేందుకు కంపెనీ ఏఐ, డేటా ఆధారిత సాంకేతికతను ఉపయోగించనుంది. ఈ అప్‌డేట్ తర్వాత సోమవారం మొబిక్విక్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి కంపెనీ షేర్ ధర 11 శాతానికి పైగా ర్యాలీ చేసి రూ. 224.80 వద్ద ముగిసింది.






