Petrol Diesel Prices:(17-02-2026)పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-17 02:41:59  IST  )

హైదరాబాద్‌లో నిన్నటితో పోల్చితే పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 ఉండగా, నేడు(మంగళవారం) రూ.107.50 ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 95.70గా ఉంది.

Petrol Diesel Prices:(17-02-2026)పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ నెల(ఫిబ్రవరి)లో ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 17) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో నిన్నటితో(సోమవారం) పోల్చితే పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 ఉండగా, నేడు(మంగళవారం) రూ.107.50 ఉంది, లీటర్ డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. అలాగే, ఏపీలోని విశాఖపట్నంలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.108.45, లీటర్ డీజిల్ ధర రూ.96.32 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.63, లీటర్ డీజిల్ ధర రూ. 97.47గా ఉంది.

Next Story