- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Middle East Crisis: భారత్‌పై మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం తక్కువే: ఎస్‌బీఐ రీసెర్చ్
ఈ ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై పాక్షికంగా ఉంటుందని అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కొత్త సమస్యలు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా సరఫరా, పెట్టుబడులపై ఒత్తిడి పెరగడంతో ప్రపంచ ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై పాక్షికంగా ఉంటుందని అభిప్రాయపడింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువ ప్రభావితం చూపుతున్నాయి. ఇప్పటికే సరఫరా దెబ్బతిన్నదని, ఇది ఎక్కువ కాలం కొనసాగితే ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. భారత్ విషయంలో ఇది తక్షణం ఆర్థిక ప్రభావం పరిమితంగా ఉన్నప్పటికీ, వాణిజ్య మార్గాలు, సరఫరా, వ్యాపార సెంటిమెంట్ దెబ్బతింటుందని నివేదిక తెలిపింది. వీటి ప్రభావం ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే రెమిటెన్సులు, ముడి చమురు దిగుమతులపై పడుతుంది. మనదేశం ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటంతో ఇంధన భద్రత కీలకమైన అంశమని నివేదిక తెలిపింది. మొత్తంమీద, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగి ప్రపంచ మార్కెట్లు మళ్లీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటాయ్. కానీ, ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌కున్న వైవిధ్య ఇంధన వనరులు, విధానపరమైన నిర్ణయాలు ఆ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నివేదిక వెల్లడించింది.






