- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India: అంతర్జాతీయ రూట్లలో అదనపు సర్వీసులు ప్రారంభించిన ఎయిర్ఇండియా
మార్చి 10-18 మధ్య తొమ్మిది అంతర్జాతీయ రూట్లలో 78 అదనపు విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ఆదివారం ప్రకటించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 10-18 మధ్య తొమ్మిది అంతర్జాతీయ రూట్లలో 78 అదనపు విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ఆదివారం ప్రకటించింది. ఈ విమానాలు ఢిల్లీ నుంచి న్యూయార్క్, లండన్, ఫ్రాంక్‌ఫర్ట్, ఆమ్‌స్టర్‌డామ్, జ్యూరిచ్, పారిస్, కొలంబో, మాలేల రూట్లలో ప్రయాణిస్తాయి. అదనంగా, ముంబై నుంచి లండన్ రూట్లలో మరో విమాన సర్వీస్ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. మద్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా విమాన సేవలకు గిరాకీ గణనీయంగా పెరిగింది. అందుకే అదనపు విమానాలను అంతర్జాతీయ రూట్లలో నడపాలని నిర్ణయించినట్టు ఎయిర్ఇండియా అధికారిక ప్రకటనలో తెలిపింది. సురక్షితమైన రూట్లలో, ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకునే కనెక్టివిటీని కొనసాగిస్తున్నామని, ఈ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటారని ఎయిర్ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ వెల్లడించారు.






