- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Microsoft: ప్రతి నెలా ఒక్కో ఇంజనీర్ 10 లక్షల లైన్ల కోడ్ రాయాలని సూచించిన మైక్రోసాఫ్ట్
వీటి స్థానంలో కొత్తగా రస్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను అమలు చేయనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా కోడింగ్‌కు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు చేయాలని భావిస్తోంది. కొన్నేళ్లుగా సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ఉపయోగిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్గత కోడింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ దశాబ్దం చివరి నాటికి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల నుంచి సీ, సీ++ కోడ్‌లను తొలగించాలని నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్తగా రస్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను అమలు చేయనుంది. ప్రస్తుతానికి దీని గురించి మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, కంపెనీ సీనియర్ అధికారి లింక్‌డ్ఇన్ పోస్ట్ ద్వారా విషయాన్ని బహిర్గతం చేశారు. కోడింగ్ వ్యవస్థలో ఈ భారీ మార్పు కోసం కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని అవసరమైనంత మేర ఉపయోగించాలని భావిస్తోంది. దీని ద్వారా సంస్థలోని ఒక్కో ఇంజనీర్ నెలకు 10 లక్షల లైన్ల కోడ్‌లను రాయాలని సూచిస్తోంది. అయితే, ఇది అంత సులభగా పూర్తయ్యే ప్రక్రియ కాదని, వేల కొద్ది కోడ్ లైన్లను రాయడానికే ఎక్కువ సమయం పడుతుందని, అలాంటి ఒక్క నెలలో ఒక్క ఉద్యోగి 10 లక్షల కోడ్‌లను చేయడం అసాధయమని అభిప్రాయపడుతున్నారు. మైక్రోసాఫ్ట్ మాత్రం ఏఐ ఏజెంట్ల సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. దీనికోసం ఇప్పటికే అత్యంత సామర్థ్యం కలిగిన కోడ్ ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన కంపెనీ సీనియర్ ఇంజనీర్ పేర్కొన్నారు.






