- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Layoff: లేఆఫ్స్ సంకేతాలిస్తున్న టెక్ దిగ్గజాలు
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ పెట్టుబడులు, వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణంపై దృష్టి పెట్టడంతో తన వర్క్‌ఫోర్స్‌ను కుదించే సంకేతాలు ఇస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ రంగంలో లేఆఫ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే కీలక కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ పెట్టుబడులు, వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణంపై దృష్టి పెట్టడంతో తన వర్క్‌ఫోర్స్‌ను కుదించే సంకేతాలు ఇస్తోంది. త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ సీఎఫ్‌ఓ ఎమీ హుడ్ మాట్లాడుతూ, రానున్న సంవత్సరాల్లో చిన్న బృందాలతో పనిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనివల్ల ఉద్యోగుల సంఖ్య సహజంగానే తగ్గవచ్చని చెప్పారు. ఈ వ్యూహంలో భాగంగా మైక్రోసాఫ్ట్ తన ఆపరేటింగ్ మోడల్‌ను మార్చుకుంటోంది. ఉద్యోగులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించడం, ఫలితాలపై జవాబుదారీ పెంచడం, చిన్న టీమ్‌లతో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మరో గ్లోబల్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తోంది. ‘ప్రాజెక్ట్ లీప్’ పేరుతో సంస్థ ఉద్యోగులను పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా వేలాది ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీని వెనుక ఉద్దేశం ఏఐ సామర్థ్యాలను పెంపొందించడం, తక్కువ ఖర్చుతో మరింత సమర్థవంతంగా ఆపరేటింగ్ మోడల్‌ను నిర్మించడమని కంపెనీ సీఎఫ్‌ఓ జతిన్ దలాల్ అన్నారు. దీనివల్ల వివిధ ప్రాంతాల్లో కనీసం 3,500 మంది ఉద్యోగులను ప్రభావితం కావొచ్చని పేర్కొన్నారు.






