Meta: మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్న మెటా

by S Gopi |   (  Updated:2026-04-18 14:05:39  IST  )

దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుందని రాయిటర్స్ పేర్కొంది. 2026 ఆఖర్లో మిగిలిన వారిని సాగనంపనుంది.

Meta: మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్న మెటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సంస్థ మెటా ఈ ఏడాదిలో భారీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతోంది. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించాలని కంపెనీ భావిస్తోంది. తొలి దశలో మే 20న సుమారు 10 శాతం, అంటే దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుందని రాయిటర్స్ పేర్కొంది. 2026 ఆఖర్లో మిగిలిన వారిని సాగనంపనుంది. కానీ, ఎంతమందిని ఎప్పుడు తొలగించాలనే వివరాలపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సామర్థ్యాలలో వస్తున్న పరిణామాలను బట్టి అధికారులు ప్రణాళికలను సర్దుబాటు చేసే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ లేఆఫ్స్ ప్రణాళిక చేపడితే కంపెనీ నాలుగేళ్లలో చేపట్టిన అతిపెద్ద తొలగింపుల ప్రక్రియ కానుంది. 2022 ఆఖర్లో 11 వేల మందిని, ఆ వెంటనే 2023లో మరో 10 వేల మందిని ఇంటికి సాగనంపింది. ప్రస్తుతానికి కంపెనీ ఏఐపై ఎక్కువ దృష్టి సారించడంతో లేఆఫ్స్ చేపడుతోంది.

ఆలస్యం కానున్న స్టార్‌లింక్ భారత ఎంట్రీ

Next Story