- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meta: మెటాలో మరో 8,000 ఉద్యోగాల కోత
మెటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ మీటా మరోసారి భారీ లేఆఫ్స్ ప్రక్రియ చేపట్టడానికి సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పోటీ మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో, మెటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. దీంతో సుమారు 8,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మే 20 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా, అదే సమయంలో దాదాపు 6,000 పోస్టుల నియామకాలను కూడా నిలిపివేయనుంది. ఏఐ ఆధారిత కార్యకలాపాలను విస్తరిస్తూ, కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెటా తెలిపింది. దీనికి సంబంధించి మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ ఉద్యోగులకు అంతర్గత మెమో పంపారు. సంస్థలో సంస్థాగత మార్పులు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రభావిత ఉద్యోగులకు మెటా జీతాల చెల్లింపుతో పాటు కుటుంబానికి 18 నెలల ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ ఇవ్వనుంది. మెటా తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ టెక్ ఉద్యోగులపైనా ప్రభావం చూపనుంది. దేశీయంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇంజినీరింగ్, ఆపరేషన్స్, కంటెంట్ మోడరేషన్ టీమ్‌లలోని వందలాది మంది లేఆఫ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.






