Meta Layoffs: ఉద్యోగులకు షాక్‌మీద షాక్‌ ఇచ్చిన మార్క్‌.. ఎన్ని వేల ఉద్యోగాలను తొలగించారంటే?

by Vennela |

Meta Layoffs: ప్రపంచస్థాయి టెక్ దిగ్గజం, ఫేస్ బుక్ మాతృసంస్థ అయిన మెటా ఫ్లాట్ ఫామ్స్ తమ ఉద్యోగులకు షాకిచ్చింది.

Meta Layoffs: ఉద్యోగులకు షాక్‌మీద షాక్‌ ఇచ్చిన మార్క్‌.. ఎన్ని వేల ఉద్యోగాలను తొలగించారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: Meta Layoffs: ప్రపంచస్థాయి టెక్ దిగ్గజం, ఫేస్ బుక్ మాతృసంస్థ అయిన మెటా ఫ్లాట్ ఫామ్స్ తమ ఉద్యోగులకు షాకిచ్చింది. మరోసారి భారీగా తొలగింపులకు రెడీ అయ్యింది. ఈ సారి సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 5శాతం మేర తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 4వేల మందిపై ప్రభావం పడనుందని అంతర్జాతీయ మీడియాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి10వ తేదీనే లేఆఫ్స్ కు సంబంధించిన మెమోలు ఉద్యోగులు అందించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ మెమో లీకైనట్లు బిజినెస్ ఇన్ సైడర్ న్యూస్ సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది.

కంపెనీలో పనితీరు సరిగ్గాలేని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా వర్గాలు తెలిపినట్లు మీడియా కథనాలు తెలిపాయి. ఈ ఏడాది మెటా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారీగా పెట్టుబడి ప్రణాళికలు రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఒక్కసారిగా భారీ లేఆఫ్స్ కు తెరతీసినట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నిర్ణయంతో కంపెనీలోని 5శాతం మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ విషయంపై గత నెలలో సిబ్బందితో మాట్లాడిన కంపెనీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ క్లారిటీ ఇచ్చారు. సరైన పనితీరు లేని వారిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఆసియా, ఆఫ్రియా, యూరప్ సహా అంతర్జాతీయంగా మొత్తం 12దేశాల్లో ఈ లేఆఫ్స్ ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు ఉద్యోగాలు కోల్పోయిన వారికి సంస్థ నుంచి అందాల్సిన ఆర్థిక, వ్రుత్తిపరమైన సహాయం అందుతుందని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఈసారి 3వేల మందిని ఉద్యోగులను తొలగిస్తున్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ సంఖ్య 4వేలకు చేరినట్లు తెలుస్తోంది. భారీగా లేఆఫ్స్ చేపట్టడం టెక్ ఉద్యోగుల్లో మళ్ల ఆందోళనలను పెంచుతోంది.

కోవిడ్ 19 మహమ్మారి విజృంభణ తర్వాత టెక్, ఐటీ ఇండస్ట్రీలో భారీగా లేఆఫ్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది నుంచి కాస్త కోలుకున్నప్పటికీ ఉద్యోగుల్లో మాత్రం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ టెక్ సంస్థలైన మైక్రో సాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ వంటి ఇతర సంస్థలు వేలాదిమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీంతో మరోసారి టెక్ ఉద్యోగుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయిందనవచ్చు. చాలా సంస్థలు ఉద్యోగుల పనితీరుపై ఫోకస్ పెట్టాయి. సరిగ్గా లేని ఉద్యోగులను ఇళ్లకు పంపించేస్తున్నాయి కంపెనీలు.

మెటా మానిటైజేషన్ వైస్ ప్రెసిడెంట్ పెంగ్ ఫ్యాన్ ఇచ్చిన మెమో ప్రకారం, ఫిబ్రవరి 11, మార్చి 13 మధ్య నియామక ప్రక్రియ వేగంగా నిర్వహిస్తుంది. ఈ కొత్త నియామక లక్ష్యం 2025 నాటికి మెటా AIని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం. దీని అర్థం, ChatGPT నుండి DeepSeek, Mistral వరకు ప్రపంచవ్యాప్తంగా AI సాంకేతికత అభివృద్ధి చెందుతున్న వేగాన్ని చూస్తే, Meta కూడా వెనుకబడి ఉండటానికి ఇష్టపడదు. బహుశా, అందుకే ఒకవైపు వారు తొలగింపులు చేస్తూనే, మరోవైపు AI అభివృద్ధి కోసం నియామకాలు చేసుకుంటున్నారు.

2025 సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కూడా కాలేదు. కానీ ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు ఇప్పటికే వందలాది మందిని తొలగించాయి. మెటా కంటే ముందు, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద టెక్ కంపెనీలు కూడా ఈ సంవత్సరం చాలా మందిని తొలగించాయి. అమెజాన్ తన ఫ్యాషన్ మరియు ఫిట్‌నెస్ విభాగం నుండి దాదాపు 200 మంది ఉద్యోగులను నిరుద్యోగులను చేసింది.

Next Story