అమెజాన్‌లో మెగా సేల్.. అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై ఊహించలేనంత తగ్గింపు

by Yella Dhawani Reddy |

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌ వినియోగదారులకు బంపరాఫర్ అందిస్తోంది.

అమెజాన్‌లో మెగా సేల్.. అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై ఊహించలేనంత తగ్గింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌ (Amazon) వినియోగదారులకు బంపరాఫర్ అందిస్తోంది. అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్‌ను (Mega Electronics Days Sale) తీసుకొచ్చింది. ఇక ఈ సేల్‌లో హెడ్ ఫోన్స్‌, ల్యాప్ టాప్స్‌, స్మార్ట్ వాచ్‌లు వంటి వివిధ రకాల బ్రాండెడ్ ప్రొడక్ట్స్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. అంతేకాదు, డెల్, సోనీ, శాంసంగ్ వంటి అనేక ఉత్ప‌త్తుల‌పై ఏకంగా 75 శాతం వ‌ర‌కు రాయితీని అందిస్తుంది. ఇప్ప‌టికే ప్రారంభమైన ఈ సేల్ ఈనెల 20 వరకు కొనసాగనుంది.

ఏస‌ర్‌, డెల్‌, ఎంఎస్ఐ, హెచ్‌పీ, అసుస్ వంటి కంపెనీల‌కు చెందిన ల్యాప్‌టాప్‌ల‌ను ఈ సేల్‌లో భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. అలాగే హెడ్ ఫోన్స్‌, ఇయ‌ర్ బ‌డ్స్‌ను కూడా చాలా త‌గ్గింపు ధ‌ర‌ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. హాన‌ర్ ప్యాడ్ 8ను రూ.12వేల‌కు, వ‌న్ ప్ల‌స్ ప్యాడ్ గోను రూ.18వేల‌కు, షియోమీ ప్యాడ్ 6ను రూ.24వేల‌కు, రెడ్మీ ప్యాడ్ ప్రొ 5Gని రూ.25వేల‌కు, షియోమీ ప్యాడ్ 7ను రూ.28వేల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ సేల్‌లో భాగంగా లెనోవో ఐడియా ట్యాబ్ ప్రొ ట్యాబ్‌ను రూ.31వేల‌కు, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్‌9 ఎఫ్ఈ ట్యాబ్‌ను రూ.35వేల‌కు, యాపిల్ ఐప్యాడ్ టెన్త్ జ‌న‌రేష‌న్ ట్యాబ్‌ను రూ.35వేల ప్రారంభ ధ‌ర‌కు, యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 5వ జ‌న‌రేష‌న్ ట్యాబ్‌ను రూ.70వేల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

అలాగే, ఈ సేల్‌లో భాగంగా భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు స్మార్ట్ వాచ్‌ల‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఫైర్ బోల్ట్‌, రెడ్‌మీ వాచ్‌, నాయిస్, అమేజ్‌ఫిట్‌, గెలాక్సీ వాచ్, యాపిల్ వాచ్ సిరీస్ 9 వంటి స్మార్ట్ వాచ్‌ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. అమెజాన్ ఆఫర్‌తో పాటు ఈ సేల్‌లో భాగంగా ప‌లు బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తుంది. హెచ్ఎస్‌బీసీ, ఫెడ‌ర‌ల్ బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌తో ఈ ఐట‌మ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.1500 వ‌ర‌కు త‌గ్గింపు ల‌భిస్తుంది. ఈఎంఐ స‌దుపాయం కూడా అందిస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అమెజాన్ సైట్‌లో డీల్స్ పేజీని సంద‌ర్శించ‌వ‌చ్చు.

Next Story