- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maruti Suzuki: ఈ ఏడాది కొత్తగా 500 సర్వీస్ వర్క్‌షాప్‌ల ఏర్పాటు: మారుతీ సుజుకి
బుధవారం మారుతీ సుజుకి తన 5,000వ అరీనా సర్వీస్ టచ్‌పాయింట్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి భారీగా సర్వీస్ వర్క్‌షాప్‌లను విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 500 సర్వీస్ వర్క్‌షాప్‌లను ప్రారంభిస్తామని తెలిపింది. బుధవారం మారుతీ సుజుకి తన 5,000వ అరీనా సర్వీస్ టచ్‌పాయింట్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేసింది. భవిష్యత్తులో కూడా మా నెట్‌వర్క్‌ను నిరంతరం విస్తరించాలనే ప్రణాళిక ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అరీనా, నెక్సా ఛానెళ్ల క్రింద 460 సర్వీస్ టచ్‌పాయింట్‌లను ప్రారంభించాము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మా నెట్‌వర్క్‌కు మొత్తం 500 సర్వీస్ వర్క్‌షాప్‌లను యాడ్ చేయాలని భావిస్తున్నామని మారుతీ సుజుకి ఎండీ, సీఈఓ హిసాషి టకేయుచి వెల్లడించారు. కొత్త టచ్‌పాయింట్‌లు అందుబాటులోకి రావడం ద్వారా కంపెనీ సర్వీస్ నెట్‌వర్క్ ఇప్పుడు 5,640కు పెరుగుతాయి. ఇవి దేశవ్యాప్తంగా 2,818 నగరాలను కవర్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 2.7 కోట్లకు పైగా వాహనాలకు సర్వీస్ అందించిందని, ఒక ఆర్థిక సంవత్సరాంలో ఇప్పటివరకు ఇదే అత్యధికమని మారుతీ సుజుకి వెల్లడించింది.






