- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారుతీ సుజూకీ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు ఇక ‘వర్క్ ఫ్రమ్ హోమ్’
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ ఉద్యోగులకు ‘హైబ్రిడ్ వర్క్’ విధానాన్ని అమలు చేయనుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్’ (Maruti Suzuki) తమ కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం సరికొత్త వర్కింగ్ పాలసీని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కంపెనీలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను అదుపు చేయడమే లక్ష్యంగా.. ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అది కూడా హైబ్రిడ్ వర్క్ మోడల్ (Hybrid Work Model) విధానాన్ని తప్పనిసరి చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగులు వారంలో కొన్ని రోజులు ఆఫీస్ నుంచి, మరికొన్ని రోజులు ఇంటి నుంచి (Work from Home) పనిచేసేలా షెడ్యూల్‌ను రూపొందించారు.
ఆటోమొబైల్ మార్కెట్లో మారుతున్న సమీకరణాలు, చైన్ సప్లయ్ ఖర్చులు పెరగడం, ఇతర నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి మారుతీ సుజుకీ ఈ నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ వర్క్ విధానం వల్ల ఆఫీసుల్లో విద్యుత్ వినియోగం, అంతర్గత రవాణా, కేటరింగ్, ఇతర నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. ఖర్చుల తగ్గింపుతో పాటు, ఈ నిర్ణయం ఉద్యోగులకు మెరుగైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అందిస్తుందని, తద్వారా ప్రొడక్షన్ పెరుగుతుందని కంపెనీ స్పష్టం చేసింది.






