- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maruti Suzuki: పెట్రోల్ బంకుల వద్దే కార్ల రిపేర్
ఈ ఒప్పందంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఇంధన రిటైల్ ఔట్‌లెట్ల వద్ద మారుతీ సుజుకి 'వెహికల్ సర్వీస్ ఫెసిలిటీ'ని ఏర్పాటు చేయనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి కొత్త తరహా సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్దే కార్ల సర్వీస్ అందించే సిద్ధమవుతోంది. దీనికోసం చమురు శుద్ధి సంస్థ ఇండియన్ ఆయిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఇంధన రిటైల్ ఔట్‌లెట్ల వద్ద మారుతీ సుజుకి 'వెహికల్ సర్వీస్ ఫెసిలిటీ'ని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వినియోగదారులు తమ వాహనాలకు సంబంధించి సాధారణ మెయింటెనెన్స్, చిన్న చిన్న మరమ్మతులు, కొన్ని మేజర్ సర్వీసెస్ కూడా లభిస్తాయి. ఇప్పటికే కంపెనీకి దేశవ్యాప్తంగా 2,882 నగరాల్లో 5,780 సర్వీస్ టచ్‌పాయింట్లను నిర్వహిస్తోంది. వీటికి అదనంగా మరింత సులభంగా సేవలను అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఇండియన్ ఆయిల్‌తో ఈ భాగస్వామ్యం ద్వారా తమ కస్టమర్లు తరచుగా వెళ్లే పెట్రోల్ బంకుల వద్దే వెహికల్ సర్వీసెస్ లభిస్తాయని మారుతీ సుజుకి ఇండియా సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామ్ సురేష్ ఆకెళ్ల అన్నారు. ఈ సహకారం మొబిలిటీ, ఇంధన రంగాన్ని ఒకేచోట చేర్చడం, మెరుగైన కస్టమర్ కేర్ సేవలను అందించేందుకు వీలవుతుందన్నారు.






