- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maruti Suzuki: 3 కోట్ల కార్లు విక్రయించిన మారుతీ సుజుకి
మొత్తం విక్రయాల్లో ఎంట్రీ-లెవల్ మోడల్ ఆల్టో అత్యంత ప్రజాదరణ పొందింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి అరుదైన ఘనతను సాధించింది. దేశీయ మార్కెట్లో కంపెనీ 3 కోట్ల అమ్మకాల మార్కును చేరుకున్నామని మారుతీ సుజుకి ఇండియా బుధవారం తెలిపింది. తొలి కోటి కార్లను విక్రయించడానికి 28 ఏళ్ల 2 రెండు నెలల సమయం పట్టిందని, ఆ తర్వాత మరో కోట్ల కార్ల విక్రయానికి 7 ఏళ్ల 5 నెలల సమయం పట్టింది. తాజాగా అధిగమించిన 3 కోట్ల కార్ల అమ్మకానికి 6 ఏళ్ల 4 నెలల రికార్డు సమయం నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. మొత్తం విక్రయాల్లో ఎంట్రీ-లెవల్ మోడల్ ఆల్టో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పటివరకు ఈ మోడల్ కార్లు 47 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి, ఆ తర్వాత వ్యాగన్ ఆర్ దాదాపు 34 లక్షల యూనిట్లు, స్విఫ్ట్ 32 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడైనట్టు కంపెనీ పేర్కొంది. కాంపాక్ట్ ఎస్‌యూఈఎలు బ్రెజ్జా, ఫ్రాంక్స్ కూడా కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన టాప్ పది వాహనాలలో ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతి 1,000 మందిలో 33 మంది దగ్గర మాత్రమే కార్లు ఉన్నాయని, దీన్ని బట్టి మేము సాధించాల్సింది చాలా ఉందనే విషయం తెలుస్తోందని మారుతీ సుజుకి ఇండియా ఎండీ, సీఈఓ హిశాషి టెకుచి అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి కార్లు అందించడంలో ఆనందం కోసం కంపెనీ అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా, తొలిసారిగా భారతీయ మార్కెట్లో 1983 డిసెంబర్‌లో అడుగుపెట్టింది. మారుతీ 800తో ఈ ప్రయాణం మొదలుపెట్టిన కంపెనీ ప్రస్తుతం దేశీయంగా 19 మోడళ్లను విక్రయిస్తోంది.






