- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Auto Industry: పన్నులు తగ్గడంతో మారుతీ సుజుకి, హ్యూండాయ్ కార్ల కోసం రికార్డు బుకింగ్‌లు
గత 35 ఏళ్లలో చూడని స్థాయిలో మొదటిరోజే 80,000 ఎంక్వైరీలు వచ్చాయని వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ పన్నులు తగ్గడంతో పాటు పండుగ సీజన్, కంపెనీలు ధరలు సవరించడంతో ఈ ఏడాదికి వాహన పరిశ్రమ రికార్డు స్థాయిలో డిమాండ్‌ను చూస్తోంది. ఇప్పటికే మారుతీ సుజుకి, హ్యూండాయ్ మోటార్ ఇండియా ఊహించని స్థాయిలో బుకింగ్‌లు సాధించామని వెల్లడించాయి. దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇప్పటికే అత్యధిక ఎంక్వైరీలు, బుకింగ్‌లు అందుకున్నామని తెలిపింది. గత 35 ఏళ్లలో చూడని స్థాయిలో జీఎస్టీ తగ్గింపు నిర్ణయం అమలులోకి రావడంతో సోమవారం మొదటిరోజే 80,000 ఎంక్వైరీలు వచ్చాయని, 25,000 కంటే ఎక్కువ కార్లను డెలివరీ చేశామని వెల్లడించింది. ఇప్పటివరకు 75,000 బుకింగ్‌లు వచ్చాయని, రోజుకు 15 వేల బుకింగ్‌లు జరుగుతున్నాయి. త్వరలో మేము 30,000 డెలివరీలు ఇవ్వగలమని, ఇప్పటివరకు బుకింగ్‌లు సాధారణంగా వచ్చే దానికంటే 50 శాతం ఎక్కువ బుకింగ్‌లు అవుతున్నాయని మారుతీ సుజుకి మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ అన్నారు. హ్యూండాయ్ మోటార్ సైతం నవరాత్రి మొదటి రోజు కావడంతో ఐదేళ్లలోనే అత్యధిక సింగిల్-డే బిల్లింగ్ జరిగినట్టు కంపెనీ హోల్-టైమ్ డైరెక్టర్, సీఓఓ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు.






