Maruti Dzire: మారుతీ డిజైర్ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు 30 లక్షల కార్ల ఉత్పత్తి..!

by Maddikunta Saikiran |

దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ(Maruti Suzuki) కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Maruti Dzire: మారుతీ డిజైర్ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు 30 లక్షల కార్ల ఉత్పత్తి..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ(Maruti Suzuki) కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరకే ఆకర్షణీయమైన ఫీచర్ల(Special Features)తో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్(Launch) చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో మిగతా కంపెనీల కార్ల్ కంటే మారుతీ కార్లు మార్కెట్లో ఎక్కువ సేల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఈ కారును ఎక్కువ మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. మారుతీ సుజుకీ తాజాగా మరో కొత్త మైలురాయి(Milestone) సాధించింది. తన పాపులర్ సెడాన్ కార్లలో ఒకటైన డిజైర్(Dzire) కార్లు ఇప్పటివరకు 30 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధించింది. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. లాంచ్ అయినా 17 ఏళ్ళ తర్వాత ఈ రికార్డు సాధించినట్లు పేర్కొంది. కాగా డిజైర్ 2008 సంవత్సరంలో భారత మార్కెట్లో(Indian Market) ఆరంగ్రేటం చేసింది. 2015 వరకు 10 లక్షల యూనిట్ల కార్లు ఉత్పత్తి కాగా.. 2019లో ఈ సంఖ్య రెట్టింపు(20 లక్షలు) అయ్యింది. మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన కార్లలో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా డిజైర్ పేరుగాంచింది. ఇక డిజైర్ మోడల్ కార్లుకు మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఈ కార్లు లాటిన్ అమెరికా, ఆఫ్రికా, అగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

Next Story