- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Retail Inflation: 10 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.40 శాతానికి పెరిగింది. ఇది ఫిబ్రవరిలో నమోదైన 3.21 శాతం కంటే అధికం.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతోంది. మార్చి నెలలో 10 నెలల గరిష్ఠాన్ని తాకింది. సోమవారం విడుదల చేసిన గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (మోస్పి) గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.40 శాతానికి పెరిగింది. ఇది ఫిబ్రవరిలో నమోదైన 3.21 శాతం కంటే అధికం. ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్లనే రిటైల్ ద్రవ్యోల్బణం పుంజుకుంది. ముఖ్యంగా టమోటాలు, క్యాలీఫ్లవర్, ఆభరణాల ధరలు ఎక్కువ ప్రభావం చేశాయి. వరుస నెలల్లో ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ ఆర్‌బీఐ 2–6 శాతం పరిధిలోనే ఉంది. సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణం 3.87 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఫిబ్రవరిలో ఇది 3.47 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 3.63 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.11 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా 5.94 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి.






