Mankind Pharma: కండోమ్ ధరలు పెంచే యోచనలో మ్యాన్‌కైండ్ ఫార్మా

by S Gopi |

ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థ కారెక్స్ కూడా ముడి పదార్థాలు, రవాణా ఖర్చుల కారణంగా ధరలను 20-30 శాతం వరకు పెంచాలని భావిస్తున్నట్టు తెలిపింది.

Mankind Pharma: కండోమ్ ధరలు పెంచే యోచనలో మ్యాన్‌కైండ్ ఫార్మా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్‌ ఫార్మా త్వరలో కండోమ్ ధరలు పెంచనున్నట్టు వెల్లడించింది. పశ్చిమాసియాలో ఘర్షణలు, చమురు ధరల పెరుగుదల కొనసాగితే కండోమ్ ధరలను పెంచక తప్పదని కంపెనీ సీఈఓ షీతల్ అరోరా స్పష్టం చేశారు. దేశంలో సుమారు 30 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉన్న మ్యాన్‌ఫోర్స్ కండోమ్‌ల తయారీలో కెమికల్స్, లూబ్రికెంట్స్, ప్యాకేజింగ్ వంటి పెట్రోలియం ఆధారిత ముడి పదార్థాల వినియోగం ఎక్కువగా ఉండటంతో, చమురు ధరల పెరుగుదల నేరుగా తయారీ ఖర్చులను ప్రభావితం చేస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీ వద్ద కొన్ని నెలలకు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ, పరిస్థితి కొనసాగితే పెరిగిన వ్యయాల్లో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపాల్సి రావచ్చని అన్నారు. ఇదే సమయంలో, ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థ కారెక్స్ కూడా ముడి పదార్థాలు, రవాణా ఖర్చుల కారణంగా ధరలను 20-30 శాతం వరకు పెంచాలని భావిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో మ్యాన్‌ఫోర్స్ 10 ప్యాక్ ధర సుమారు రూ.100-150 మధ్య ఉంది.

Next Story