- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
M&M: ప్రతి 10 నిమిషాలకు ఒక ఈవీ విక్రయిస్తున్న మహీంద్రా
దీనర్థం ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) అమ్ముడవుతున్నది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. గడిచిన ఏడు నెలల వ్యవధిలోనే కంపెనీ 30,000 ఈవీ ఎస్‌యూవీలను విక్రయించినట్టు బుధవారం ప్రకటించింది. దీనర్థం ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) అమ్ముడవుతున్నది. దేశీయ ఈవీ మార్కెట్లో ఆధిపత్యం కోసం కంపెనీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే గతేడాది నవరంబర్‌లో ఎంఅండ్ఎం ఎక్స్ఈవీ 933, బీఈ6 కార్లను విడుదల చేసింది. ఈ రెండు వాహనాల వార్షికోత్సవం సందర్భంగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. తమ ఈవీ ఎస్‌యూవీలలో 65 శాతం(అంటే దాదాపు ప్రతి మూడింటిలో రెండు) వర్కింగ్ డే సమయంలో రోడ్లపై తిరుగుతున్నాయి. ఇది ఈవీ మార్కెట్లో తమ కార్లకున్న ప్రాధాన్యతను సూచిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఈ రెండు కార్లు కొత్త కస్టమర్లను ఆకట్టుకున్నాయని కంపెనీ చెబుతోంది. పది మందిలో ఎనిమిది మంది కస్టమర్లు మొదటిసారి వాహనం కొన్నవారు ఉన్నారని స్పష్టం చేసింది. ఈవీ విభాగంలో పెరుగుతున్న డిమాండ్, ముఖ్యంగా మహీంద్రా కార్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో దీన్ని మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ తెలిపింది. దీనికోసం 2027 ఆఖరు నాటికి 180 కిలోవట్‌తో 250 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న గిరాకికి తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలను అవసరమని భావిస్తున్నాం, అందుకే 250 స్టేషన్లలో 1,000 ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉండేలా చూస్తామని వెల్లడించింది.






