- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
M&M: కొత్త ఎలక్ట్రిక్ 7-సీటర్ ఎస్‌యూవీ ఎక్స్ఈవీ 9ఎస్ విడుదల చేసిన మహీంద్రా
జనవరి 14 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీలు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఎక్స్ఈవీ 9ఎస్ ఫేరుతో విడుదల చేసిన ఈ కారు మొట్టమొదటి 7-సీటర్ ఈవీ ఎస్‌యూవీ కావడం విశేషం. దీని ధర రూ. 19.95 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 29.45 లక్షలు ఉంటుందని గురువారం ప్రకటనలో వెల్లడించింది. ఈ మోడల్ ఈవీ విభాగంలో సౌకర్యం, అధునాతన సాంకేతికత కలిగిన కారు కోసం చూస్తున్న కొనుగోలుదారులను ఆకర్షించడానికి స్పేసియస్, ఫ్యామిలీ-ఫోకస్డ్ ఈవీగా వస్తుంది. ఈ ఎస్‌యూవీ కొనాలనుకునే వారు 2026, జనవరి 14 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీలు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.
ఇప్పటికే ఈవీ సెగ్మెంట్‌లో రెండు కార్లను విడుదల చేసిన ఎంఅండ్ఎం కొత్త ఎక్స్ఈవీ 9ఎస్ ద్వారా మార్కెట్లో పట్టు సాధించాలని భావిస్తోంది. ఈ కారు టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని డిసెంబర్ 5 నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ఇక, ఈ ఎస్‌యూవీ ఫీచర్లకు సంబంధించి మూడు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుది. అవి.. 59 కిలోవాట్ అవర్, 79 కిలోవాట్ అవర్, 79 కిలోవాట్ అవర్. 175 కిలోవాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. వేరియంట్‌ని బట్టి ఒక్కసారి ఛార్జింగ్ ద్వారా 521 కిలోమీటర్ల నుంచి 679 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 20 నిమిషాల్లో 20-80 శాతం వరకు వేగంగా ఛార్జింగ్ అవుతుంది. కేవలం 7 సెకెన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 202 కిలోమీటర్ల వేగం అందుకోగలదని కంపెనీ వివరించింది. అలాగే, ఎక్స్ఈవీ 9ఎస్ అతిపెద్ద క్యాబిన్‌ను అందిస్తుందని మహీంద్రా తెలిపింది. 527 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. అంతేకాకుండా ఈవీ సెగ్మెంట్‌లోనే అరుదుగా కనిపించే 150 లీటర్ల ఫ్రంక్(వాహనం ముందు భాగంలో ఉండే స్పేస్) కూడా ఉంది.






