- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
M&M: కొత్త బొలెరో విడుదల చేసిన మహీంద్రా.. ప్రారంభ ధర రూ. 8 లక్షలు
టాప్-ఎండ్ వేరియంట్ బొలెరో బీ8, బొలెరో నియో ఎన్11 మరింత ప్రీమియం ఫీచర్లను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) సోమవారం తన కొత్త బొలెరో మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్తగా తీసుకొచ్చిన బొలేరో మోడల్‌ను రీఫ్రెష్‌డ్ స్టైలింగ్, అధునాతన ఫీచర్లతో లభిస్తుందని కంపెనీ తెలిపింది. అప్‌గ్రేడ్ చేసిన ఈ వాహనంలో టాప్-ఎండ్ వేరియంట్ బొలెరో బీ8, బొలెరో నియో ఎన్11 మరింత ప్రీమియం, ఇప్పుడున్న ఎస్‌యూవీల స్థాయిలో ఫీచర్లను అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఈ వాహన ధర రూ. 7.99 లక్షల నుంచి మొదలై రూ. 9.69 లక్షల వరకు(ఎక్స్‌షోరూమ్) ఉంటుందని, బొలెరో నియో ధర రూ. 8.49 లక్షల నుంచి రూ. 9.99 లక్షల మధ్య(ఎక్స్‌షోరూమ్) లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అప్‌గ్రేడ్ చేసిన బొలెరో వాహనంలో రిఫ్రెష్ చేసిన గ్రిల్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, డైమండ్-కట్ ఆర్15 అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతేకాకుండా కస్టమర్లకు కొత్త స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా ఉందని, 17.8 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో ఫీచర్లు కలిగి ఉంది. 25 ఏళ్లకు పైగా దేశీయ వాహన మార్కెట్లో బొలేరో మోడల్ కస్టమర్లకు ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ఇష్టమైన వాహనంగా ఉందని కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ నళినీకాంత్ పేర్కొన్నారు.






