Scheme: మహిళలకు నిర్మలమ్మ షాక్‌.. ఈ స్కీమ్‌కు బ్రేకులు.. ప్చ్.. రూ.2లక్షలు

by Vennela |

Mahila Samman Scheme:కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన 2025-26కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

Scheme: మహిళలకు నిర్మలమ్మ షాక్‌.. ఈ స్కీమ్‌కు బ్రేకులు.. ప్చ్.. రూ.2లక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: Mahila Samman Scheme:కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన 2025-26కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా టాక్స్ పేయర్స్ కు రూ. 12లక్షల వరకు నో టాక్స్ అని ప్రకటించింది శుభవార్త చెప్పింది. అయితే ఇదే సమయంలో పలు కొత్త స్కీములను ప్రకటించినప్పటికీ మహిళలకు 2023 బడ్జెట్ లో తీసుకొచ్చినటువంటి మహిళా సమ్మాన్ స్కీమ్ గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కేంద్రంలోని మోదీ సర్కార్ మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా ఇందులో చేరవచ్చు. మైనర్ల పేరుతో వారి తల్లిదండ్రులు లేదా గార్డియెన్స్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలుంటుంది. మహిళలో ఆర్థిక సాధికారత పెంపొందించేందుకు మహిళలకు పొదుపు అలవాటు చేసేందుకు ఉద్దేశించిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్ కు ఆరంభంలో మంచి ఆదరణే లభించింది. పెద్ద మొత్తంలో అకౌంట్లు ఓపెన్ చేశారు. 2023 బడ్జెట్లో ఈ స్కీమ్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. అదే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

అయితే ఈ స్కీమ్ ప్రారంభించిన సమయంలోనే 2025 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు అందుకోసం దాదాపు మరో 2 నెలల్లోపు గడువు ఉన్న క్రమంలో ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఈ స్కీమ్ పొడిగింపుపై ప్రకటన వస్తుందని అంతా అనుకున్నారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. అసలు ఈ స్కీం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. అంటే ప్రస్తుతానికి ఈ స్కీమ్ గడువు మార్చి 31 వరకే ఉంది. అంటే ఆసక్తి ఉన్న మహిళా పెట్టుబడిదారులు..ఇందులో ఆలోపే చేరడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ స్కీమ్ తీసుకువచ్చింది కేంద్రం. ఇందులో వార్షిక ప్రాతిపదికన 7.50శాతం వడ్డీ రేటు ఉంది. ప్రస్తుతం రెండేళ్ల వ్యవధికి చాలా బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్ల కంటే ఇందులో కాస్త ఎక్కువగా వడ్డీ ఉందని చెప్పవచ్చు. అయితే ఈ స్కీముకు మంచి ఆదరణ లభించింది. పెట్టుబడి విషయానికి వస్తే ఇందులో కనీసం రూ. 1000 నుంచి డబ్బులు జమ చేయవచ్చు. గరిష్టంగా రూ. 2లక్షల వరకు డిపాజిట్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. స్కీమ్ గడువు కూడా రెండేళ్లుగా ఉంటుంది. ఇప్పుడు 2025 ఫిబ్రవరి 5న దీనిలో చేరితే..మెచ్యూరిటీ 2027 ఫిబ్రవరి 5న అవుతుంది. ఇప్పుడు డబ్బులు జమ చేస్తే సరిగ్గా 2ఏళ్లకు మీ చేతికి డబ్బులు వస్తాయి. ఏడాది తర్వాత కూడా డబ్బులను పాక్షికంగా 40శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్బాల్లో మాత్రమే అకౌంట్ నుంచి వైదొలిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ రాబడిపై టాక్స్ వర్తిస్తుంది.

ఇందులో రూ. లక్ష జమ చేసినట్లయితే 7.50శాతం వడ్డీ రేటు ప్రకారం..ఏడాదిలో రూ. 16,022 వడ్డీ వస్తుంది. అదే రూ. 2లక్షలు జమ చేసినట్లయితే అప్పుడు రూ. 32,044 వడ్డీ అందుతుంది. ప్రస్తుతానికి ఈ స్కీం గురించి ఎలాంటి ప్రకటనా చేయనందున పొడిగింపుపై ఏమాత్రం స్పష్టత లేదు. మరి మార్చి 31లోపు కేంద్రం ఈ స్కీమ్ గురించి ఏమైనా ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. లేని పక్షంలో ఈ స్కీమ్ కు ఇక ముగింపు పలికినట్లేనని భావించవచ్చు. ఇప్పటికే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కు సంబంధించి కొత్త ట్రాంచిలు రావడం లేదు. దీంతో ఆ స్కీమ్ ను దాదాపు ముగించినట్లేనని కేంద్రం కూడా స్పష్టత ఇచ్చింది. మరి ఈ స్కీం గురించి ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాల్సిందే.

Next Story