- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Luxury Products: లగ్జరీ ఉత్పత్తులపై కేంద్రం పన్నుల కొరడా.. 1 శాతం టీసీఎస్ అమలు
ఈ నిర్ణయం మంగళవారం(ఏప్రిల్ 22) నుంచే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: లగ్జరీ ఉత్పత్తులపై కేంద్రం పన్నుల కొరడా ఝులిపించింది. రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన లగ్జరీ వాచీలు, బ్యాగులపై 1 శాతం మూలం వద్ద పన్ను వసూలు(టీసీఎస్) చేయనున్నట్టు ఆదాయపు పన్ను శాఖ బుధవారం ప్రకటించింది. ఈ నిర్ణయం మంగళవారం(ఏప్రిల్ 22) నుంచే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ పన్ను చేతి గడియారంతో పాటు పెయింటింగ్‌లు, శిల్పాలు, పురాతన వస్తువులు, నాణేలు, స్టాంపులు, పడవలు, హెలికాప్టర్లు, లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు, సన్ గ్లాసెస్, పాదరక్షలు, హై-ఎండ్ స్పోర్ట్స్‌వేర్, అత్యాధునిక గృహోపకరణాలు, గృహోపకరణాలు వంటి ఉత్పత్తులకు 1 శాతం టీసీఎస్ వర్తిస్తుందని ఐటీ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అధిక ఖరీదైన ఉత్పత్తుల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. దీనివల్ల లగ్జరీ ఉత్పత్తుల విభాగంలో ఆడిట్ ట్రయల్ బలోపేతం చేసే లక్ష్యంతోనే ఇది అమలు చేశారని నాంగియా అండర్సన్ ఎల్ఎల్‌పీ ట్యాక్స్ పార్ట్‌నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని, లగ్జరీ ఉత్పత్తులు కొనే ముందు వినియోగదారులు కేవైసీతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలను ఇవ్వాలి. తద్వారా లగ్జరీ ఉత్పత్తుల అమ్మకాలపై నియంత్రణ ఉంటుందని సందీప్ పేర్కొన్నారు.






