- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG GAS PRICE TODAY(June 01): గుడ్ న్యూస్.. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. అయితే నేడు ఒకటో తారీకు కావడంతో ధరలు తగ్గుముఖం పోతాయేమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూశారు. వారు ఎదురు చూసినట్టే నేడు దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. 19 కేజీల సిలిండర్ ధరను రూ.24 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1945గా, ఢిల్లీలో రూ.1723 కు చేరింది. కాగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదారాబాద్: రూ. 905
వరంగల్: రూ. 924
విశాఖపట్నం: రూ. 861
విజయవాడ: రూ. 875
గుంటూరు: రూ. 877






