MCLR: తగ్గనున్న ఐఓబీ, ఐడీబీఐ బ్యాంకుల ఈఎంఐలు

by S Gopi |

బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్) సవరించాయి.

MCLR: తగ్గనున్న ఐఓబీ, ఐడీబీఐ బ్యాంకుల ఈఎంఐలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల పలు బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా రెండు బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్) సవరించాయి. ఐడీబీఐ బ్యాంకు శుక్రవారం(సెప్టెంబర్ 12) నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చేలా ఎంసీఎల్ఆర్‌ను సవరించాయి. ఎంసీఎల్ఆర్ అనేది వినియోగదారులు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగత వంటి రిటైల్ రుణాల వడ్డీ రేట్లపై ప్రభావం చూపే ప్రామాణిక రేటు. సాధారణంగా బ్యాంకులు ఎంసీఎల్ఆర్‌ను బెంచ్‌మార్క్‌గా అమలు చేస్తాయి. ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఐఓబీ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్‌ని 8.05 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. రిటైల్ రుణాలపై నేరుగా ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధిపై 5 బేసిస్ పాయింట్లు తగ్గి 8.85 శాతానికి సవరించింది. అలాగే, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్‌ని 8.90 శాతానికి తగ్గించింది. ఇక, ఐడీబీఐ బ్యాంకు కూడా కూడా వివిధ కాలవ్యవధుల ఎంసీఎల్ఆర్‌ను సవరించింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్‌ను 8.05 శాతానికి, నెల రోజులకు 8.20 శాతం, మూడు నెలలకు 8.50 శాతం, ఆరు నెలలకు 8.70 శాతానికి మార్పులు చేసింది. రిటైల్ రుణాలను ప్రభావితం చేసే ఏడాది కాలవ్యవధి ఉన్న ఎంసీఎల్ఆర్‌ను 8.75 శాతానికి, రెండేళ్లకు 9.30 శాతానికి, మూడేళ్లకు 9.70 శాతానికి సవరించింది.

Next Story