Small EVs: భారత్‌లో చిన్న ఈవీ కార్లను తీసుకొస్తాం: ఫోక్స్‌వ్యాగన్ సీఈఓ

by S Gopi |

మెరుగైన వ్యూహంతో ఈ విభాగంలో వాహనాలను తీసుకొచ్చేందుకు భాగస్వాములతో చర్చిస్తున్నామని కంపెనీ సీఈఓ ఆలివర్ బ్లూమ్ తెలిపారు.

Small EVs: భారత్‌లో చిన్న ఈవీ కార్లను తీసుకొస్తాం: ఫోక్స్‌వ్యాగన్ సీఈఓ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ మార్కెట్లో సరసమైన, చిన్న ఎలక్ట్రిక్ కార్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నామని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ అభిప్రాయపడింది. మెరుగైన వ్యూహంతో ఈ విభాగంలో వాహనాలను తీసుకొచ్చేందుకు భాగస్వాములతో చర్చిస్తున్నామని కంపెనీ సీఈఓ ఆలివర్ బ్లూమ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ఇప్పటికే ప్రపనంలో మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా ఉన్న భారత్, మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఎలక్ట్రిక్ చిన్న కార్ల విభాగంలో 'ఐడీ క్రాస్ కాన్సెప్ట్ కింద కంపెనీ స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ ఎపిక్‌తో పాటు, పోలో, కుప్రా కార్లను తీసుకురానుంది. ఎలక్ట్రిక్ అర్బన్ కార్ ఫ్యామిలీ కింద సరసమైన ధరలో వివిధ బ్రాండ్లలో ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కార్లపైనా పనిచేస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగానే ఆయన భారత మార్కెట్‌పై ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ మార్కెట్ కోసం చిన్న ఈవీ కార్లను తీసుకొస్తామని తెలిపారు. అయితే, ప్రీమియం, లగ్జరీ కార్ల విభాగంలోనూ అవకాశాలను వదులుకోమని స్పష్టం చేశారు.

Next Story