LIC వన్ మ్యాన్ ఆఫీస్ సేవలు ఆవిష్కరణ

by Muthe.Rajitha |

ఎల్ ఐసీ ( లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ) పాలసీదారులకు నిరాంతరాయ డిజిటల్ సేవలు అందించేందుకు వన్ మ్యాన్ ఆఫీస్ ఆన్లైన్ సేవలను ఆవిష్కరించినట్లు ఎల్ ఐసీ సంస్థ సీఈవో సిద్ధార్థ మహంతి సోమవారం పత్రిక ప్రకటలో తెలిపారు.

LIC వన్ మ్యాన్ ఆఫీస్ సేవలు ఆవిష్కరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : LIC ( లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ) పాలసీదారులకు నిరాంతరాయ డిజిటల్ సేవలు అందించేందుకు వన్ మ్యాన్ ఆఫీస్ ఆన్లైన్ సేవలను ఆవిష్కరించినట్లు ఎల్ ఐసీ సంస్థ సీఈవో సిద్ధార్థ మహంతి సోమవారం పత్రిక ప్రకటలో తెలిపారు. 2047 నాటికి అందరికి భీమా లక్ష్యాన్ని సాధించడం కోరకు ఓఎంవో ఆవీష్కరణ ఉపయోగపడుతుందని పేర్కోన్నారు. మొబైల్ ఫోన్‌ల ద్వారా ఓఎంవో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రతి విషయంలోను పాలసీదారులను నిజమైన ఆత్మ నిర్భర్‌గా మారుస్తుందన్నారు. ఈ సేవలు ఆనంద (ఆత్మ నిర్భర్ ఏజెంట్స్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్) ప్లాట్‌ఫారమ్ ద్వారా కస్టమర్లను ఆన్‌బోర్డింగ్ చేయడానికి అందించబడతాయని తెలిపారు. ప్రీమియం కాలిక్యులేటర్, బెనిఫిట్ ఇలస్ట్రేషన్, ఈ నాచ్ రిజిస్ట్రేషన్, చిరునామా మార్పు, ఆన్‌లైన్ లోన్ రిక్వెస్ట్, రెన్యూవల్ ప్రీమియం చెల్లింపులు, క్లెయిమ్ సంబంధిత విషయాలపై ఫీచర్లను కలిగి ఉంటాయని పేర్కోన్నారు.

Next Story