- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LIC: ఎల్ఐసీలో సరికొత్తగా ‘మార్టెక్’ ఫ్లాట్‌ఫాం సేవలు
భారతదేశపు అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ సరికొత్తగా మార్కెటింగ్ టెక్నాలజీ (మార్టెక్) ప్లాట్‌ఫాంను ప్రారంభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశపు అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ సరికొత్తగా మార్కెటింగ్ టెక్నాలజీ (మార్టెక్) ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. రాబోయే వినియోగదారుల కోసం ప్రాజెక్ట్ డీఐవీ కింద దీన్ని ఆరంభించారు. ప్రపంచ స్థాయి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ బీమా రంగంలో ప్రపంచ డిజిటల్ ఛాంపియన్‌గా అవతరించేందుకు ఈ టెక్నాలజీ దొహదపడుతునందని ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మోహంతి తెలిపారు. ఎల్ఐసీలోనే సరికొత్తగా మార్కెటింగ్ టెక్నాలజీ ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ‘మార్టెక్’ ప్లాట్‌ఫాంను ప్రారంభంతో ఎల్‌ఐసీ సాహసోపేతమైన కొత్త జర్నీని స్టార్ట్ చేసిందని అన్నారు. మార్టెక్ ప్లాట్‌ఫారమ్ బహుళ-ఛానల్ ఎంగేజ్‌మెంట్ సామర్థ్యాన్ని పరిచయం చేస్తుందని పేర్కొన్నారు. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఎప్పటికీ ఆన్‌లో ఉండే ప్రచారాల అమలు చేసి ఎల్ఐసీ వ్యాపార వృద్ధిని నడిపించేలా పని చేస్తుందని తెలిపారు. ఎల్‌ఐసీ రాబోయే తరం డిజిటల్ సామర్థ్యాలను కొనసాంచేందుకు ఈ ప్లాట్‌ఫాంను ప్రవేశపెడుతున్నామని అన్నారు. గ్లోబల్ ఇన్సూరెన్స్ ల్యాండ్ స్కేప్‌లో ముందంజలో ఉందని మోహంతి తెలిపారు.






