- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LIC: రిటైర్‌మెంట్ తర్వాత ఆదాయం కోసం 'స్మార్ట్ పెన్షన్ ప్లాన్'
అలాగే జాయింట్ లైఫ్ యాన్యూటీ సదుపాయం కూడా ఈ ప్లాన్‌లో ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఆదాయం కావాలనుకునే వారికోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) సరికొత్త యాన్యూటీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. భవిష్యత్తు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకునేవారిని లక్ష్యంగా చేసుకుని ఎల్ఐసీ 'స్మార్ట్ పెన్షన్ ప్లాన్'ను బుధవారం ప్రారంభించింది. దీనికి సంబంధించి ఎల్ఐసీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రిటర్న్‌లను కోరుకునే కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా ఈ ప్లాన్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయని, ఒక్కసారి ప్రీమియం చెల్లించి జీవితాంతం పెన్షన్ పొందవచ్చని తెలిపారు. అలాగే జాయింట్ లైఫ్ యాన్యూటీ సదుపాయం కూడా ఈ ప్లాన్‌లో ఉంది. పాలసీదారుల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పునీత్ కుమార్ వెల్లడించారు. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ అనేది నాన్ పార్టిసిపేటింగ్, నాన్-లింక్‌డ్, ఇండివిడ్యువల్ లేదా గ్రూప్, సేవింగ్స్, ఇన్‌స్టంట్ యాన్యూటీ ప్లాన్(ప్లాన్ 879). నెలవారీగానే కాకుండా మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక పద్దతిన చెల్లింపులు చేయవచ్చని, నిబంధనలను అనుసరించి పాక్షిక మొత్తం లేదంటే పూర్తిగా విత్‌డ్రా చేసుకునే వీలుంటుందని సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. చెల్లించిన మొత్తంపై రుణాన్ని పొందే సదుపాయం కూడా ఇందులో ఉంది. 18-100 ఏళ్ల మధ్య వయసు వారు దీన్ని ఎంచుకోవచ్చు. మార్కెట్ పరిస్థితులకు సంబంధం లేకుండా కొనుగోలు చేసిన మొత్తానికి హామీ లభిస్తుంది. నెలకు రూ. 1,000 చొప్పున యాన్యూటీ పొందవచ్చు. పాలసీ కనీస ప్రీమియం రూ. లక్ష ఉంటుందని, దీనికి గరిష్ట పరిమితి లేదని సంస్థ వెల్లడించింది.






