LIC: భార్యాభర్తల కోసం రెండు కొత్త జాయింట్ లైఫ్ ప్లాన్‌లు లాంచ్ చేసిన ఎల్ఐసీ

by S Gopi |

భార్యాభర్తల ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్పత్తులను రూపొందించినట్లు ఎల్ఐసీ తెలిపింది.

LIC: భార్యాభర్తల కోసం రెండు కొత్త జాయింట్ లైఫ్ ప్లాన్‌లు లాంచ్ చేసిన ఎల్ఐసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ భార్యాభర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు కొత్త జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం’, ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం’ పేర్లతో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌లు, ఒకే పాలసీ కింద జీవిత భద్రతతో పాటు దీర్ఘకాలిక పొదుపు ప్రయోజనాలను అందించనున్నాయి. భార్యాభర్తల ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్పత్తులను రూపొందించినట్లు ఎల్ఐసీ తెలిపింది. ఈ రెండు ప్లాన్‌లు నాన్-పార్, నాన్-లింక్డ్ సేవింగ్స్ ఉత్పత్తులుగా ఉండి, గ్యారెంటీడ్ అడిషన్స్, స్థిరమైన ప్రయోజనాలతో వస్తాయి. సింగిల్ ప్రీమియం ప్లాన్‌లో ఒకేసారి ప్రీమియం చెల్లించే అవకాశం ఉండగా, లిమిటెడ్ ప్రీమియం ప్లాన్‌లో పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించే సౌలభ్యం ఉంటుంది. ఒకే పాలసీ ద్వారా భార్యాభర్తలకు రక్షణ కల్పించడం, గ్యారెంటీడ్ రిటర్న్స్ ఇవ్వడం, అలాగే అవసరానికి అనుగుణంగా డెత్ బెనిఫిట్స్ ఆప్షన్లను అందించడం ఈ ప్లాన్‌ల లక్ష్యమని ఎల్ఐసీ తెలిపింది. జూన్‌ 1 నుంచి ఈ పాలసీలు కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.

Next Story