- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LIC గిన్నీస్ రికార్డ్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness Book of World Records) కు ఎక్కింది.

దిశ, వెబ్ డెస్క్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness Book of World Records) కు ఎక్కింది. జనవరి 20న 24 గంటల్లో 5,88,107 జీవిత బీమా పాలసీలు జారీ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫీట్ సాధించింది. ఈ రికార్డ్‌ను కంపెనీకి చెందిన 4,52,839 మంది LIC ఏజెంట్లు సాధ్యం చేశారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, CEO సిద్ధార్థ మొహంతి(Siddhartha Mehanti) నాయకత్వంలో 'మ్యాడ్ మిలియన్ డే'(Mad Million Day) పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు, ఇందులో ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దీంతో కంపెనీలోని ప్రతీ ఏజెంట్ ఒక పాలసీ చేయించడం ద్వారా ఎల్ఐసీ ఈ ఘనత సాధించింది. తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ఈ ఫీట్ ను ధృవీకరిస్తూ.. కంపెనీని అభినదించారు. కాగా ఇది జీవిత బీమా రంగంలో ప్రపంచలోనే ఓ సరికొత్త రికార్డ్‌గా నమోదైంది.






