- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LIC: మహిళ కోసం ప్రత్యేక పాలసీ 'ఎల్ఐసీ బీమాలక్ష్మీ'
ఈ పాలసీ మనీ-బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్, అంటే పొదుపు, బీమా కవరేజీ రెండింటినీ హామీ ఇస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఎప్పటికప్పుడు ప్రజల కోసం కొత్త బీమా పథకాలను తీసుకువస్తోంది. ఎల్ఐసీ బీమా అంటే గ్యారంటీ రిటర్స్న్, రిస్క్ లేకపోవడం వల్ల ఎక్కువమంది వీటిలో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ గతేడాది ఆఖరులో మహిళల కోసమే ప్రత్యేకంగా అద్భుతమైన బీమా పథకాన్ని తీసుకొచ్చింది. బీమా లక్ష్మీ పేరుతో తెచ్చిన ఈ బీమా పథకం మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి సహాయపడుతుందని, మహిళలకు భారీ మొత్తంలో డబ్బును అందిస్తుందని ఎల్ఐసీ చెబుతోంది. ఈ పాలసీ గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
ఎల్ఐసీ బీమా లక్ష్మి మహిళలకు లభిస్తున్న వరం లాంటి బీమా పథకం. ఈ ప్లాన్ రక్షణతో పాటు, పొదుపు, హామీ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పాలసీ మనీ-బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్, అంటే పొదుపు, బీమా కవరేజీ రెండింటినీ హామీ ఇస్తుంది. 18-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పాలసీ కొనవచ్చు. ఒకవేళ మైనర్ కుమార్తెలు ఉంటే సంరక్షకులుగా ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ స్కీమ్. దీనర్థం, మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో మూడు రకాల ఆప్షన్‌లు ఉంటాయి. మీరు ఎంచుకున్న ఆప్షన్ బట్టి హామీ మొత్తాన్ని విడతల వారీగా పొందొచ్చు.
ఈ పాలసీ ప్రత్యేకత
* పాలసీ వ్యవధి 25 సంవత్సరాలు కాగా, ప్రీమియం చెల్లించే కాలవ్యవధి 7 నుంచి 15 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు.
* బీమా లక్ష్మి పాలసీ తీసుకునేందుకు మహిళల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఈ పాలసీలో కనీస బీమా హామీ రూ.2 లక్షలు ఉంటుంది. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు.
* ప్రతి సంవత్సరం, మీరు 7 శాతం ప్రీమియం ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే, 7 శాతం ప్రీమియం యాడ్ చేయడం ద్వారా, మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం అందుకునే వీలుంటుంది.
* పాలసీ యాక్టివ్‌గా ఉన్న సమయంలో పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా బీమా హామీ మొత్తంలో ఏది ఎక్కువైతే అది ఎల్ఐసీ చెల్లిస్తుంది.
* ప్రీమియం చెల్లించే వ్యవధిని నెల, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాది.. వీలును బట్టి చెల్లించేలా ఎంచుకునే వీలుంటుంది.
* యాక్సిడెంటల్ డెత్, డిజెబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఫీమేల్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ లాంటి రైడర్లు యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
* ఈ పథకం కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. సెక్షన్ 80సీ కింద ప్రీమియంపై, సెక్షన్ 10(10డీ) కింద మెచ్యూరిటీపై పన్ను మినహాయింపు అందుకోవచ్చు.
ఉదాహరణకు..
40 ఏళ్ల వయసున్న మహిళ బీమా లక్ష్మీ పాలసీని రూ. 3 లక్షల బీమా, 15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే, ఆమె ఏడాదికి సుమారు రూ. 53,500 వరకు వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, నెలకు రూ. 4,460 వరకు ఉంటుంది. మెచ్యూరిటీ లాభం దాదాపు రూ. 13.10 లక్షల లభిస్తుంది. సర్వైకల్ బెనిఫిట్ ద్వారా ప్రతి రెండేళ్లకు ఒకసారి రూ. 22,500 మేర వస్తే, మొత్తం లాభం రూ. 15.8 లక్షల అవుతుంది. ఏడాదికి రూ. 53,500 15 ఏళ్ల పాటు చెల్లిస్తే, 25 ఏళ్ల తర్వాత దాదాపుగా రూ. 16 లక్షల వరకు పొందవచ్చు. అయితే, ఈ స్థాయిలో మెచ్యూరిటీ పాలసీ టర్మ్, బోనస్ రేటు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.






