LG India: ఐపీఓకు సిద్ధమవుతున్న ఎల్‌జీ ఇండియా

by S Gopi |

అక్టోబర్‌ మొదటివారంలో సబ్‌స్క్రిప్షన్ ప్రారంభిస్తుందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.

LG India: ఐపీఓకు సిద్ధమవుతున్న ఎల్‌జీ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్‌జీ ఈ ఏడాదిలోనే అతిపెద్ద ఐపీఓకు సిద్ధమవుతోంది. ఎల్‌జీ కంపెనీ తన ఇండియా యూనిట్ అయిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూను ప్రారంభించనుంది. స్టాక్ మార్కెట్ల నుంచి కంపెనీ సుమారు రూ. 15,000 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు అక్టోబర్‌ మొదటివారంలో సబ్‌స్క్రిప్షన్ ప్రారంభిస్తుందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్న కారణంగా స్థిరమైన పరిస్థితుల కోసం కంపెనీ ఎదురుచూస్తోంది. ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఎల్‌జీ ఇండియా పబ్లిక్ ఇష్యూకు ఆమోదం తెలిపింది. కంపెనీ తన ఇండియాలోని 15 శాతం వరకు వాటాను విక్రయించాలని భావిస్తోంది. అంటే ఇది దాదాపు 10.2 కోట్ల షేర్లకు సమానం. గతేడాది అక్టోబర్‌లో హ్యుండాయ్ ఐపీఓ తర్వాత, దేశంలో ఇదే రెండవ అతిపెద్ద ఐపీఓ కానుంది. 2025లో ఇప్పటివరకు దాదాపు 30 ఐపీఓలు రూ. 60,000 కోట్లకు పైగా సేకరించాయి. వీటిలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 12,500 కోట్ల ఐపీఓనే అతిపెద్దది. ఎల్‌జీ ఇండియాతో పాటు ఈ ఏడాది టాటా కేపిటల్, అర్బన్ కంపెనీ, బోట్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఐపీఓ కోసం సిద్ధంగా ఉన్నాయి.

Next Story