- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lava Phone: బోల్డ్ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసిన లావా
ఈ రెండూ ఐపీ54 రేటింగ్‌తో వచ్చాయని, వీటి సర్వీస్‌ని దేశవ్యాప్తంగా ఇంటి వద్దే ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ మొబైల్‌ఫోన్ తయారీ సంస్థ లావా కొత్తగా బోల్డ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. వీటిని రూ. 10 వేల కంటే తక్కువ ధరలో తీసుకొచ్చిన కంపెనీ, వీటి సర్వీస్‌ని దేశవ్యాప్తంగా ఇంటి వద్దే ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. బోల్డ్ ఎన్1, బోల్డ్ ఎన్1 ప్రో పేర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటాయని లావా వెల్లడించింది. ఈ రెండూ ప్రధానంగా ఐపీ54 రేటింగ్‌తో వచ్చాయని, బోల్డ్ ఎన్1 ప్రో టైటానియం గోల్డ్, స్టీల్త్ బ్లాక్ రంగులలో లభిస్తుంది, బోల్డ్ ఎన్1 రేడియంట్ బ్లాక్, స్పార్కింగ్ ఐవరీ రంగులలో ఉంటాయి. బోల్డ్ ఎన్1 6.75 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 90హెర్ట్జ్ రీఫ్రెష్‌తో వస్తుంది. 13 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 15పై పనిచేస్తుంది. దీని ధర రూ. 5,999గా నిర్ణయించారు. ఈ మోడల్ ఫోన్ అమ్మకాలు జూన్ 4 నుంచి మొదలవుతాయి. బోల్డ్ ఎన్1 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల హెచ్‌డీ పల్స్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో, 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. రూ. 6,799 ధరలో లభించే ఈ ఫోన్ విక్రయాలు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.






