- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Lamborghini: రూ.4.57 కోట్లతో లంబోర్గిని హైబ్రిడ్ కారు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని ఇండియాలో కొత్త మోడల్ కారను విడుదల చేసింది. దీని పేరు ‘ఉరుస్ SE’. ధర రూ.4.57 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్‌లో లాంచ్ అయింది. కారు, 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌తో రన్ అవుతుంది. ఇంజన్ గరిష్టంగా 620hp శక్తిని, 800Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, దీనికి అదనంగా 25.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీ మోడల్‌లో రన్ అవుతున్నప్పుడు ఇంజన్ 189 hp పవర్, 483 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంధనం అయిన పోయిన కూడా ఈవీ మోడ్‌లో 60 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.
సాధారణంగా కారు 3.4 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 312 kmph. ఇది ఆరు డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తుంది, అవి Strada, Sport, Corsa, Neve, Sabbia,Terra . కారు ఆన్-రోడ్, ఆఫ్-రోడ్‌లో ప్రయాణానికి అనువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. కారు లోపల 12.3-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్, డెడికేటెడ్ టెలిమెట్రీ సిస్టం, అప్‌డేట్ చేయబడిన డ్రైవర్-అసిస్టెన్స్ డిస్‌ప్లేలు ఇంకా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. లంబోర్ఘిని ఆసియా పసిఫిక్ రీజియన్ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో స్కార్డొని మాట్లాడుతూ, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త టెక్నాలజీలతో హైబ్రిడ్ కారును తీసుకొచ్చాం,మా బ్రాండ్‌కు ముఖ్యమైన మైలురాయిగా ఉరుస్ SE నిలుస్తుందని అన్నారు.