Tesla: టెస్లాకు ప్రాధాన్యత కలిగిన ఫైనాన్షియర్‌గా కోటక్ మహీంద్రా ప్రైమ్

by S Gopi |

టెస్లాకు భారత్‌లో ప్రిఫర్‌డ్ ఫైనాన్షర్‌గా నియమించిన కంపెనీలో కోటక్ మహీంద్రా ప్రైమ్ మొదటిదని పేర్కొంది.

Tesla: టెస్లాకు ప్రాధాన్యత కలిగిన ఫైనాన్షియర్‌గా కోటక్ మహీంద్రా ప్రైమ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవలే భారత మార్కెట్లోకి అడుగు పెట్టిన గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లాకు ప్రిఫర్‌డ్ ఫైనాన్షర్‌గా మారినట్టు కోటక్ గ్రూప్‌లో వాహన రుణాలిచ్చే కోటక్ మహీంద్రా ప్రైమ్ వెల్లడించింది. భవిష్యత్తులో టెస్లా ఈవీ కార్లను కొనే కస్టమర్లకు సజావుగా ఫైనాన్స్ సౌకర్యాలను అందించేందుకు, తాము మొదటి ప్రాధాన్యత సంస్థగా మారినట్టు కంపెనీ శుక్రవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా టెస్లాకు భారత్‌లో ప్రిఫర్‌డ్ ఫైనాన్షర్‌గా నియమించిన కంపెనీలో కోటక్ మహీంద్రా ప్రైమ్ మొదటిదని పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా టెస్లా ఈవీలను కొనేవారి కోసం తమ కంపెనీ ప్రత్యేకంగా క్యూరేటెడ్ కార్ ఫైనాన్స్ స్కీమ్స్ అందిస్తుంది. దీనివల్ల చాలా సులభంగా ఈవీ కారు కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని, టెస్లా ఇండియా పోర్టల్ లేదా మొబైల్ యాప్ నుంచి కూడా తమ ఫైనాన్స్ ఆప్షన్లను ఎంచుకోవచ్చని వెల్లడించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కోటక్ మహీంద్రా ప్రైమ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ షారుఖ్ తోడివాలా.. వాహన రుణాల విషయంలో తమ కంపెనీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటోంది. ఇప్పుడు టెస్లా సహకారంతో కస్టమర్లు మరింత విశ్వాసంతో తమ మొబిలిటీ ఫైనాన్స్ సౌకర్యాలను పొందగలుగుతారు. భవిష్యత్తులో ఫైనాన్స్ విభాగంలో తమ ప్రయత్నాలకు ఇది మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు.

Next Story