Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే భారీ నష్టం తప్పదు

by Vennela |

Akshaya Tritiya: మనదేశంలో అక్షయ తృతీయ సందర్భంగా చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. చాలా కాలంగా ఈ ఆనవాయితీ వస్తోంది.

Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే భారీ నష్టం తప్పదు
X

దిశ, వెబ్ డెస్క్: Akshaya Tritiya: మనదేశంలో అక్షయ తృతీయ సందర్భంగా చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. చాలా కాలంగా ఈ ఆనవాయితీ వస్తోంది. అక్షయ తృతీయ రోజు బంగార కొంటే శుభప్రదమని చాలా మంది నమ్ముతుంటారు. ఏప్రిల్ 30న జరుపుకోనున్న అక్షయ తృతీయ కొత్త పెట్టుబడులకు అనువైన సమయం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్, డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ. 1లక్ష రూపాయల మార్క్ దాటేసింది. దీంతో కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంగారం క్వాలిటీ, ప్యూరిటీ జాగ్రత్తగా చెక్ చేయాలి. ముందుగా 24క్యారెట్ల బంగారం 999, 995ఫైన్ నెస్ గురించి తెలుసుకుంటే మోసపోకుండా ఉంటారు. బంగారం కొనేటప్పుడు ద్రుష్టిలో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం స్వచ్చత:

24 క్యారెట్ల బంగారంలో ఇతర మెటల్స్ ఇవీ కలవవు. దాదాపు 100శాతం స్వచ్చత కలిగి ఉంటుంది. రిపైనింగ్ సమయంలో స్వల్ప మలినాలు చేయడం సహజం. మార్కెట్లో 999 లేదా 995 ఫైన్ నెస్ గల 24 క్యారెట్ల బంగారం కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. 999 ఫైన్ నెస్ లో 1,000 భాగాల్లో 999 భాగాలు ప్యూర్ బంగారం ఉంటుంది. 995 ఫైన్ నెస్ లో 5 బాగాలు మలినాలు ఉంటాయి. పెట్టుబడి లక్ష్యంతో బంగారం కొనాలనుకునేవారు 999 ఫైన్ నెస్ ఎంచుకోవడం బెస్ట్. ఈ స్వచ్ఛతతో కాయిన్స్, బార్స్ అందుబాటులో ఉంటాయి. 995 ఫైన్ నెస్ కొన్ని కాయిన్స్, ఆభరణాల్లో కనిపిస్తుంది. స్వచ్చత ఎక్కువైతే ధర స్వల్పంగా పెరుగుతుంది.

22 క్యారెట్ జ్యువెల్లరీ:

24 క్యారెట్ గోల్డ్ సాఫ్ట్ గా ఉంటుంది. దీంతో నగలు తయారు చేయలేరు. అందుకే 22 క్యారెట్ లేదా 18 క్యారెట్ గోల్డ్ తో ఇతర మెటల్స్ కలిపి నగలను తయారు చేస్తారు. అయితే అక్షయ తృతీయ సమయంలో 24క్యారెట్లతో చిన్న పెండెంట్స్, దేవతా విగ్రహాలు, కాయిన్స్ అందుబాటులో ఉంటాయి. పశ్చిమభారతదేశంలో 23క్యారెట్ నగలను ఇష్టపడుతుంటారు. 24క్యారెట్ ఆభరణాలకు ప్రత్యేక యంత్రాలు అవసరం ఉంటుంది. ఇవి సాధారణ దుకాణాల్లో అందుబాటులో ఉండవు. ట్రెడిషనల్ డిజైన్ల కోసం 22 క్యారెట్ ఎంచుకోవడం మంచిది. ఇవి మన్నికగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

హాల్ మార్కింగ్ నిబంధనలు:

2021 జూన్ నుంచి భారత ప్రభుత్వం బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. 14,18,20,22,23,24 క్యారెట్ల స్థాయిల్లో హాల్ మార్క్ ఉండాలి. 24క్యారెట్ల బంగారంలో 995 ఫైన్ నెస్ ప్రమాణంగా గుర్తిస్తారు. కాయిన్స్, బార్స్ కు హాల్ మార్కింగ్ తప్పనిసరి కాదు. అయినా కూడా నిపుణులు హాల్ మార్క్ ఉన్నవి కొనాలని సూచిస్తారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్క్ ఉన్నట్లయితే.. స్వచ్ఛతకు హామీ ఉన్నట్లే. హాల్ మార్క్ లేని బంగారం కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

బంగారం కొనేందుకు చిట్కాలు:

అక్షయ తృతీయ సమయంలో గోల్డ్ కొనే ముందు నమ్మకమైన దుకాణాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం 999 ఫైన్ నెస్ కాయిన్స్ లేదా బార్స్ ఉత్తమం. ధరలను పలు దుకాణాలు, ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ లో సరిపోల్చుకోవాలి. బంగారం ధర రోజువారీ మార్కెట్ ధరలపై ఆధారపడి ఉంటుంది. కొనుగోలు బిల్లు, స్వచ్చత ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్న మొత్తాల్లో పెట్టుబడి కోసం పేటీఎం, గూగుల్ పే వంటి ఫ్లాట్ ఫామ్స్ లో డిజిటల్ గోల్డ్ కొనుగోలు అనుకూలంగా ఉంటుంది. BIS వెబ్ సైట్లో హాల్ మార్క్ జ్యువెల్లర్స్ జాబితాను చెక్ చేయాలి.

Next Story