- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MCLR: తగ్గనున్న కరూర్ వైశ్యా బ్యాంకు రుణాల రేట్లు
by S Gopi |
ఎంసీఎల్ఆర్ ను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

X
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ రుణాల రేట్లు దిగి రానున్నాయి. శుక్రవారం బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీనివల్ల వినియోగదారులు తీసుకున్న వ్యక్తిగత, వాహన, గృహ వంటి రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా బ్యాంకులు రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఎంసీఎల్ఆర్‌నే ప్రామాణికంగా తీసుకుంటాయి. కరూర్ వైశ్యా బ్యాంకు సవరించిన రేట్ల ప్రకారం, రిటైల్ రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 9.55 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గింది. ఇక, నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30-9.45 శాతానికి తగ్గాయి. సవరించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది.
Next Story






