- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంపర్ ఆఫర్.. కేవలం రూ.51 కే 28 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB డేటా
కొత్త వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే 'ఫ్రీడమ్ ఆఫర్' తెచ్చింది. రూ.51 కే ఉచిత సిమ్ కార్డ్, 28 రోజుల పాటు రోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయినప్పటికి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది. ఈ క్రమంలో తమ మొబైల్ వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సరికొత్త కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా 'ఫ్రీడమ్ ఆఫర్' (Freedom Offer) పేరిట కేవలం రూ.51 కే అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కింద కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా సిమ్ కార్డ్ పూర్తిగా ఉచితంగా (Free SIM) అందించబడుతుంది. సాధారణంగా ప్రైవేట్ కంపెనీలు వందల రూపాయలు వసూలు చేసే 28 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీని బీఎస్ఎన్ఎల్ కేవలం రూ.51 ప్లాన్‌తోనే ఆఫర్ చేస్తుండటం గమనార్హం.
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 28 రోజుల పాటు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, రోజూ 100 ఎస్ఎమ్ఎస్ (SMS)లతో పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా మాట్లాడుకునేలా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అయితే, ఈ బంపర్ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. ఆసక్తి గల వినియోగదారులు జూన్ 30 లోపు మాత్రమే ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త కనెక్షన్ పొందాలనుకునే వారు తమ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లు లేదా అధీకృత రిటైల్ స్టోర్లను సందర్శించి ఈ లబ్ధిని పొందవచ్చని సంస్థ అధికారులు వెల్లడించారు.






