JSW Motors: సొంత షోరూమ్‌లు ప్రారంభించనున్న జేఎండబ్ల్యూ మోటార్స్

by S Gopi |

ముంబై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కనీసం నాలుగు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

JSW Motors: సొంత షోరూమ్‌లు ప్రారంభించనున్న జేఎండబ్ల్యూ మోటార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆటోమోటివ్ విభాగం ఈ ఏడాది చివర్లో తన తొలి వాహనాన్ని విడుదల చేయనుంది. అయితే, దాని కంటే ముందు సొంతంగా షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. దేశీయంగా కీలక నగరాల్లో కంపెనీ షోరూమ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముంబై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కనీసం నాలుగు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటి ద్వారా వినియోగదారులు జేఎస్‌డబ్ల్యూ కార్లను నేరుగా చూసి కొనుగోలు చేసే వీలుంటుందని కంపెనీ ఆశిస్తోంది. జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ తన తొలి మోడల్‌గా ప్రీమియం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాన్ని లాంచ్ చేయనుంది. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వీటిని మార్కెట్లోకి తెస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ప్రారంభ దశలో స్వయంగా షోరూమ్‌లను నిర్వహించి, తర్వాత డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని తెలిపింది. ఇప్పటికే మహారాష్ట్రలో కంపెనీ కొత్త తయారీ ప్లాంటును కూడా ఏర్పాటు చేస్తోంది. అక్కడ ఎలక్ట్రిక్ ట్రక్కులు, బస్సులు, ప్యాసింజర్ వాహనాలు ఉత్పత్తి చేయనుంది. దీని ద్వారా భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త స్వదేశీ బ్రాండ్‌గా జేఎస్‌డబ్ల్యూను నిలపాలని లక్ష్యంగా ఉంది.

Next Story