iphone: 2026లో మార్కెట్లోకి యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌

by S Gopi |

ఫోల్డబుల్ ఐఫోన్ బుక్-స్టైల్‌తో 7.8 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఇన్నర్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే స్క్రీన్‌తో..

iphone: 2026లో మార్కెట్లోకి యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే శాంసంగ్‌తో పాటు పలు కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్‌లను తీసుకొచ్చాయి. ఈ విషయంలో గ్లోబల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యాపిల్ సైతం ఇప్పటికే తన ఫోల్డబుల్ ఐఫోన్ గురించి అనేక లీకులు ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించి వచ్చే ఏడాదిలో యాపిల్ తన ఐఫోన్ ఫోల్డ్‌తో ఫోల్డబుల్ ఫోన్ విభాగంలోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది. యాపిల్ అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ జేపీ మోర్గాన్ పలు వివరాలను వెల్లడించింది. యాపిల్‌ కొత్తగా రెండు ఫోల్డబుల్‌ డివైజ్‌లపై పని చేస్తోందని సమాచారం. క్లామ్‌షెల్ స్టైల్‌ ఐఫోన్‌, 20 అంగుళాల ఫోల్డబుల్‌ ఐప్యాడ్‌తో ఫోల్డబుల్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఐఫోన్ నుంచి రాబోయే ఫోల్డబుల్ ఐఫోన్ బుక్-స్టైల్‌తో 7.8 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఇన్నర్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే స్క్రీన్‌తో వచ్చే అవకాశాలున్నాయి. దీన్ని 2026లో విడుదల కాబోయే ఐఫోన్‌ 18 సిరీస్‌లో భాగంగా తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్టు జేపీ మోర్గాన్ అనలిస్ట్ సమిక్ ఛటర్జీ చెప్పారు. యాపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర 1,999 డాలర్లు(సుమారు రూ. 1.74 లక్షలు) ఉంటుందని అంచనా. ఫోల్డబుల్ ఫోన్ల విభాగంలో ప్రస్తుతం శాంసంగ్‌, హువావే, మోటోరొలా బ్రాండ్లు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. త్వరలో వీటికి పోటీగా ఐఫోన్‌ ఈ విభాగంలో అడుగుపెట్టనుంది.

Next Story