అమెరికా కమ్యూనికేషన్ పరికరాల తయారీ కంపెనీని కొనుగోలు చేసిన జియో!

by Disha Web Desk 12 |
అమెరికా కమ్యూనికేషన్ పరికరాల తయారీ కంపెనీని కొనుగోలు చేసిన జియో!
X

న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దేశీయంగా 5జీ, బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ కోసం అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ పరికరాల తయారీ కంపెనీ మిమోసా నెట్‌వర్క్‌ను కొను చేయనున్నట్టు గురువారం ప్రకటనలో వెల్లడిచ్నింది. సుమారు రూ. 492 కోట్లని తెలిపింది. అందులో భాగంగా జియో అనుబంధ ర్యాడిసిస్, మిమోసా మాతృసంస్థ ఎయిర్‌స్పాన్ నెట్‌వర్క్స్ హోల్డింగ్స్ మధ్య ఒప్పందం జరిగినట్టు గురువారం ప్రకటనలో వెల్లడించింది. ఒప్పందం ఈ ఏడాది ద్వితీయార్థంలో పూర్తయ్యే అవకాశం ఉందని ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి.

మిమోసా కంపెనీ వైఫై 5, వైఫై 6 ఈ టెక్నాలజీ కి చెందిన పాయింట్-టు-పాయింట్, పాయింట్-టూ-మల్టీ పాయింట్ నెట్‌వర్క్ పరికరాలను తయారు చేస్తోంది. సంబంధిత పరికరాల తయారీలోనూ ఉంది. అలాగే, రిలయన్స్ జియో 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు తర్వాత 5జీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో తగిన వ్యూహాలను కలిగి ఉంది. జియో టెలికాం రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. దేశవ్యాప్తంగా 5జీ వైర్‌లెస్ సేవలను విస్తరించడానికి గతేడాది నోకియాను ప్రధాన సరఫరాదారుగా ఎంపిక చేసింది. ఇక, రిలయన్స్ జియో సంస్థకు మిమోసా మాతృసంస్థ ఎయిర్‌స్పాన్‌లో వాటాలతో పాటు సదరు కంపెనీ బోర్డులో సభ్యత్వం ఉంది.

Also Read...

భారత విక్రయాలపై యాపిల్ ప్రత్యేక దృష్టి!


Next Story

Most Viewed