- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JioHotstar: దక్షిణాది కంటెంట్ కోసం భారీ పెట్టుబడులు ప్రకటించిన జియోహాట్‌స్టార్
వచ్చే 12 నెలల్లో 1,500 గంటల కొత్త సౌత్ కంటెంట్‌ను విడుదల చేయాలని భావిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణాది కథలకు డిమాండ్ బాగా పెరగడంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ దక్షిణ భారత సినిమాలు, సిరీస్‌లపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం రాబోయే ఐదేళ్ల కాలంలో కంపెనీ రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా వచ్చే 12 నెలల్లో 1,500 గంటల కొత్త సౌత్ కంటెంట్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. జియోహాట్‌స్టార్‌లో సౌత్ కంటెంట్ కోసం చూసే సమయం 70 శాతం పెరిగింది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని జియోస్టార్ క్లస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ (సౌత్) హెడ్ కృష్ణన్ కుట్టి అన్నారు. ప్రస్తుతం దక్షిణాది కంటెంట్ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నదని, చాలామంది ప్రేక్షకులు దక్షిణాది కంటెంట్‌ను ఎక్కువగా చూస్తున్నారని కృష్ణన్ చెప్పారు. దక్షిణాదిన అధిక సబ్‌స్క్రిప్షన్, మెరుగైన యాక్టివ్ యూజర్లు, ఎక్కువగా టీవీ కనెక్ట్ వినియోగం ఉందని కృష్నన్ కుట్టి తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం జియోహాట్‌స్టార్ ఒరిజినల్ షోలు, సినిమాలు, సిరీస్‌లతో సహా 25 కొత్త సౌత్ టైటిల్‌లను ప్రకటించింది.
దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగంగా పెరుగుతోంది. జియోహాట్‌స్టార్ తాజా నిర్ణయంతో ప్రాంతీయ కంటెంట్‌కు ఎక్కువ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. జియోహాట్‌స్టార్‌కు ఇంగ్లిష్-కంటెంట్ వ్యూస్‌పై ప్రభావం ఉన్నప్పటికీ, ప్రాంతీయ, ప్రత్యేక కంటెంట్ దీన్ని భర్తీ చేయగలదు. ముఖ్యంగా జీ5 లాంటి ప్లాట్‌ఫామ్‌లు సాంస్కృతికంగా పాతుకుపోయిన స్థానిక కంటెంట్ ద్వారా టైర్-2, టైర్-3 ప్రాంతాల లక్ష్యంగా కంటెంట్ ఇస్తున్నది. ఓర్మాక్స్ మీడియా ప్రకారం, దేశంలో ఓటీటీ యూజర్ల వృద్ధి ఈ ఏడాది 9.9 శాతం పెరిగింది.






