- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JioHotstar: హాట్‌స్టార్‌లో హెచ్‌బీఓ మ్యాక్స్ సేవలు
దేశీయంగా హెచ్‌బీఓ మ్యాక్స్ కంటెంట్ అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫామ్‌గా జియోహాట్‌స్టార్‌గా నిలిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ప్రీమియం అంతర్జాతీయ కంటెంట్‌ను అందించేందుకు కీలక ఒప్పందం చేసుకుంది. దేశీయ యూజర్ల కోసం హెచ్‌బీఓ మ్యాక్స్ కంటెంట్‌ను అందించడానికి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో దేశీయంగా హెచ్‌బీఓ మ్యాక్స్ కంటెంట్ అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫామ్‌గా జియోహాట్‌స్టార్‌గా నిలిచింది. ఈ భాగస్వామ్యంతో హెచ్‌బీఓ మ్యాక్స్ హబ్, హెచ్‌బీఓ, మ్యాక్స్ ఒరిజినల్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ టెలివిజన్, డీసీ స్టూడియోస్‌కు చెందిన కంటెంట్‌ను ఒకచోట చూడవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ 'హ్యారీ పోటర్', 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్' కలెక్షన్లతో సహా వార్నర్ బ్రదర్స్ కంటెంట్, అలాగే డీసీ యూనివర్స్ నుంచి హాలీవుడ్ సినిమాలను కూడా చూడవచ్చు. ఈ ఒప్పందంతో తమ ప్రీమియం బ్రాండ్‌లు, ఫ్రాంచైజీల కంటెంట్ పరిధిని విస్తరించడమే కాకుండా, భారత యూజర్లతో మెరుగైన సంబంధాలను కొనసాగించడానికి వీలవుతుందని వార్నర్ బ్రదర్స్ ప్రెసిడెంట్ జేమ్స్ గిబ్బన్స్ తెలిపారు. జియోహాట్‌స్టార్‌లో హెచ్‌బీఓ మ్యాక్స్ కంటెంట్ ద్వారా భారత్‌లో అంతర్జాతీయ కంటెంట్ ప్రమాణాలను పెంచుతున్నామని జియోహట్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ కెవిన్ వాజ్ పేర్కొన్నారు.






