JIO : జియో బంపర్ ఆఫర్.. వావ్ అంటున్న వినియోగదారులు

by Muthe.Rajitha |

రిలయన్స్ జియో(Reliance Jio) తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

JIO : జియో బంపర్ ఆఫర్.. వావ్ అంటున్న వినియోగదారులు
X

దిశ, వెబ్ డెస్క్ : రిలయన్స్ జియో(Reliance Jio) తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.895 తో రిచార్జ్ తో 336 రోజుల ఆఫర్(336 Days Offer) ప్రకటించింది. కేవలం రూ.895 తో రిచార్జ్ చేసుకుంటే 336 రోజుల వరకు అని మొబైల్ నెట్ వర్క్స్ కు ఆన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు, 24 జీబీ డేటా, రోజుకు 50 మెసేజీలు అందిస్తోంది. అంటే ఈ ప్లాన్ లో నెలకు రూ.81 మాత్రమే వినియోగదారునికి ఖర్చు అవుతుంది. అయితే ఇది అందరికీ కాదండోయ్.. కేవలం జియో బేసిక్ ఫోన్స్(Jio Phones) అంటే జియో ఫోన్లు, జియో భారత్ ఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని షరతులు విధించింది కంపెనీ.

కాగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఈ ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో లేదని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు బేసిక్ ఫోన్ యూజర్లు నెలకు రూ.150 రిచార్జ్ చేయాల్సి వచ్చేది. దీనితో పోలిస్తే రూ.81 సగానికి సగం తక్కువ అంటున్నారు కస్టమర్లు. ఈ ఆఫర్ ను స్మార్ట్ ఫోన్ యూజర్లకు కూడా తీసుకు రావాలని భారీగా వినతులు వస్తున్నట్టు అధికారులు తెలియ జేశారు.

Next Story