జియో నెట్‌వర్క్ సేవలకు అంతరాయం

by Yella Dhawani Reddy |

దేశంలోని అగ్రగామి టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) నెట్‌వర్క్ సేవలకు పలు చోట్ల అంతరాయం ఏర్పడింది.

జియో నెట్‌వర్క్ సేవలకు అంతరాయం
X

దిశ, వెబ్ డెస్క్: దేశీయ అగ్రగామి టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) నెట్‌వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో యూజర్లు మొబైల్ డేటా, ఫోన్ కాల్స్ సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాగే, మధ్యాహ్నం 4:54 గంటల సమయంలో డౌన్‌డిటెక్టర్ అనే అవుటేజ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్లు ఫిర్యాదు చేశారు. సుమారు 55% మంది మొబైల్ ఇంటర్నెట్ సమస్యలను, 33% మంది జియోఫైబర్ సమస్యలను, 12% మంది తమ పరికరాల్లో సిగ్నల్ లేని సమస్యను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. అయితే, దీనికి గల కారణమేంటన్నది తెలియరాలేదు.

Next Story